• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కరోనా శెలవులు.....

కరోనా శెలవులు.. విలవిలలాడుతున్న ఈవెంట్ సంస్థలు!

By - Tupaki Desk
Update: 2020-03-18 11:03 GMT
టాలీవుడ్ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. తెలుగు సినిమాలపై ఆధారపడి ఎన్నో కంపెనీలు మనుగడ సాగిస్తాయి. అలాంటి వాటిలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు కూడా ఉంటాయి. సినిమా ఫంక్షన్లు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అందులోనూ ఎవరో ఒక స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ హాజరవుతారంటే చాలు ఆ కార్యక్రమం ఆటోమేటిక్ గా క్రేజీగా మారిపోతుంది. ఇలాంటి ఈవెంట్లు అన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు నిర్వహిస్తాయి. రెగ్యులర్ గా ఏదో ఒక సినిమా ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ సంస్థలకు చేతినిండా పని ఉంటుంది. కరోనా దెబ్బకు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు విలవిలలాడుతున్నాయని సమాచారం.

టాలీవుడ్ లో రెండు ప్రముఖ ఈవెంట్ మేనేజెమెంట్ సంస్థలు రొటేషన్ పద్దతిలో ఈవెంట్స్ నడిపిస్తారు. వీరికి వారానికి కనీసం ఒక్కటైనా ఈవెంట్ ఉండాలి. లేకపోతే కంపెనీలు నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉందని సమాచారం. పదిహేను రోజుల శెలవుల కారణంగా ఈవెంట్లు మొత్తం రద్దయ్యాయి. కోవిడ్-19 కనుక కంట్రోల్ లోకి రాకపోతే మరి కొన్ని రోజులు టాలీవుడ్ లో ఈవెంట్ లు రద్దయ్యే అవకాశం ఉంది.

ఈ కంపెనీలు గతంలో నిర్వహించిన ఈవెంట్ల డబ్బు కూడా ఇంకా అందక పోవడం... కొత్తగా ఈవెంట్లు లేకపోవడం తో ఈ సంస్థలకు నష్టాలు తప్పవని.. ఈ నష్టాలు పూడ్చుకోవాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా కరోనా ప్రభావం చాలామందిపై చూపిస్తోంది. ఈవెంట్ మేనేజెమెంట్ కంపెనీలు కూడా దాని దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
Tags:    
  • Tollywood 
  • Tollywood news 
  • Latest News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • corona 
  • covid 19 
  • event management 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS