• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'మిస్టర్‌ మజ్ను' కాపీనా?

'మిస్టర్‌ మజ్ను' కాపీనా?

By - Tupaki Desk
Update: 2018-09-26 06:18 GMT
అఖిల్‌ అక్కినేని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రంపై అక్కినేని అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌ ప్లే బాయ్‌ గా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదలైన టీజర్‌ ద్వారా తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు - నాగార్జునలు రొమాంటిక్‌ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. వారి దారిలోనే అఖిల్‌ ఈ చిత్రంతో రొమాంటిక్‌ హీరోగా పేరు తెచ్చుకుంటాడనిపిస్తుంది. వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై కాపీ విమర్శలు వస్తున్నాయి.

బాలీవుడ్‌ లో రణబీర్‌ కపూర్‌ హీరోగా వచ్చిన బచ్నా ఏ హసీనో అనే చిత్రానికి ఇది కాపీ అంటూ టాక్‌ వినిపిస్తుంది. లవ్‌ రొమాంటిక్‌ సినిమాలు అన్ని కూడా దాదాపు ఒకే విధంగా, ఒకే ప్లాట్‌ తో ఉంటాయి, కనుక ‘బచ్నా ఏ హసీనో’ చిత్రానికి ‘మిస్టర్‌ మజ్ను’ కాపీ అంటూ ఇప్పుడే చెప్పలేం. సినిమా విడుదలయితే కాని అసలు విషయం క్లారిటీ రాదు. కాని సోషల్‌ మీడియాలో మాత్రం ఆ బాలీవుడ్‌ సినిమాకు మిస్టర్‌ మజ్ను ప్రీక్వెల్‌ అని  ఇన్సిపిరేషన్‌ గా తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న కాపీ ప్రచారం పక్కన పెడితే ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. అఖిల్‌ కు ఈ చిత్రం చాలా కీలకం అని చెప్పుకోవాలి. మొదటి రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. అందుకే ఈ చిత్రంతో అయినా అఖిల్‌ తన సత్తాను చాటాల్సి ఉంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తుంది.

Tags:    
  • Akhil 3rd Movie 
  • Mr Majnu 
  • Telugu NEWs 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS