జూనియర్‌ నాని స్టే హోమ్‌ సందేశం

Update: 2020-04-15 05:30 GMT
ఈమద్య ఏ టీవీలో అయినా.. ఏ ప్రభుత్వ అధికారి అయినా.. ఏ సెలబ్రెటీ అయినా కూడా ఒకే మాట చెబుతున్నారు అదే స్టే హోమ్‌. లాక్‌ డౌన్‌ ను పకడ్బందీగా అమలు చేయడంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అరికట్టబడుతుందని సెలబ్రెటీలతో పాటు అంతా కూడా సోషల్‌ మీడియాలో ఇతరత్ర మీడియాలో చెబుతున్నారు. తాజాగా ఈ విషయమై హీరో నాని కొడుకు జున్ను కూడా మెసేజ్‌ ఇచ్చాడు.

ట్విట్టర్‌ లో నాని పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతుంది. తన కొడుకుతో ట్విట్టర్‌ లో నాని స్టే హోమ్‌ మెసేజ్‌ ను ఇచ్చాడు. వీడియోలో నాని కొడుకుతో బయట ఎవరున్నారు అంటూ నాని ప్రశ్నింగా జున్ను కరోనా ఉంది అంటూ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటూ నాని ప్రశ్నించగా ఇంట్లోనే ఉండాలంటూ మళ్లీ సమాధానం చెప్పాడు. అప్పుడు ఏం జరుగుతుందని అడుగ్గా కరోనా గో.. అంటూ క్యూట్‌ గా సమాధానం ఇచ్చాడు.

బయట ఉన్న కరోనా పారి పోవాలంటే మనం అంతా కూడా ఇంటికే పరిమితం అవ్వాలంటూ జున్ను ఇచ్చిన సందేశం నెటిజన్స్‌ ను ఆకట్టుకుంది. నాని ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటన్నింటిని లాక్‌ డౌన్‌ కారణంగా ఆపేశారు. ఇక నాని నటించిన ‘వి’ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా వేశారు. అది ఎప్పటికి విడుదల అయ్యేనో కూడా తెలియని పరిస్థితి. ‘వి’ చిత్రంలో నాని నెగటివ్‌ పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. నానికి ఇది 25వ చిత్రం.
Tags:    

Similar News