విజయ్ దేవరకొండ కామెంట్లపై వివాదం
విజయ్ దేవరకొండ కామెంట్లు వివాదాస్పదం కావడం కొత్తేమీ కాదు. ఈ తరం కుర్రాళ్లకు ప్రతినిధిలా కనిపించే విజయ్.. కొన్నిసార్లు అగ్రెసివ్‌గా, బోల్డ్‌గా మాట్లాడేస్తుంటాడు. తనకు ఏమనిపిస్తే అది మాట్లాడే క్రమంలో కొన్నిసార్లు అతడి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతుంటాయి. తాజాగా భారతీయ ఎన్నికల వ్యవస్థ గురించి అతను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్, అనుపమ చోప్రాలతో చిట్ చాట్ సందర్భంగా అతను రాజకీయాలు, ఎన్నికల గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా 21 ఏళ్ల వయసు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఇచ్చేయడం కరెక్ట్ కాదని అతను అభిప్రాయపడ్డాడు.
లిక్కర్ కోసం ఓటును అమ్ముకునే వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని అతనన్నాడు. అలాగే బాగా డబ్బున్న వాళ్లకు కూడా ఓటు హక్కు వద్దన్నాడు. డబ్బుల కోసం, మందు కోసం ఓటును అమ్ముకునే, తన ఓటు విలువేంటో తెలియని వాళ్లకు ఓటు హక్కు ఎందుకని అతను ప్రశ్నించాడు. చదువుకుని ఓటు హక్కు విలువ తెలిసిన మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని అతనన్నాడు. అలాగే తన దృష్టిలో ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వమే మంచిదని.. నాయకుడికి మంచి చేయాలన్న ఆలోచన ఉన్నపుడు డిక్టేటర్‌షిప్ ఉండటమే కరెక్ట్ అని అతనన్నాడు. అలా ఉంటే తప్ప జనాలు దారికి రారన్నట్లుగా విజయ్ మాట్లాడాడు. విజయ్ వ్యాఖ్యలను కొందరు సమర్థించినా.. ఇంకొందరు తప్పుబట్టారు. అతడి వ్యాఖ్యలు ఆచరణ సాధ్యం కాని విధంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.