వాళ్లకు జైల్ కాదు.. వెలి వేస్తారట
సెలబ్రిటీలు.. ఎండార్స్ మెంట్లు.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. బ్రాండ్ అంబాసిడర్లుగా మారేందుకు సెలబ్రిటీలుగా ఎదుగుతారో.. సెలబ్రిటీలుగా మారారు కాబట్టి అండార్స్ మెంట్ చేసే అవకాశం వచ్చిందో చెప్పడం.. ఆయా ప్రకటనలు ఇచ్చేవాళ్లకు కూడా కష్టమే. అంతగా ఆ కంపెనీలు ఇచ్చే డబ్బులకు అలవాటు పడిపోతారు మన స్టార్లు.
జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది కఠిన నిర్ణయాలు తీసుకుంటూ.. కన్జూమర్ ప్రొటెక్షన్ బిల్ 2015ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా తప్పుడు సమాచారం ఇస్తూ ఆయా ప్రకటనల్లో కనిపించిన వారికి జైలు శిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడీ బిల్లుపై కేంద్రం ఆలోచనలో పడింది. ప్రపంచంలో ఎక్కడా లేనంత కఠినంగా.. జైలు శిక్షలు విధించే బిల్లును ప్రవేశపెట్టడం సరికాదని భావించడంతో.. ఈబిల్లులో కీలకమార్పులను ప్రతిపాదిస్తున్నారు.
నియమ నిబంధనలను ఉల్లంఘించన ప్రకటనల్లో నటించన వారికి మొదటి సారి 10 లక్షల జరిమానా.. ఏడాది పాటు నిషేధం విధిస్తారట. తర్వాత 50 లక్షల జరిమానా 3 ఏళ్ల నిషేధం వర్తించేలా బిల్లులో మార్పులు చేసి పార్లమెంట్ అనుమతి పొందనుంది కేంద్రం. ఇక్కడ నిషేధం స్థానంలో జైలు శిక్ష ఉండేది. అయినా.. జైలు శిక్ష విధిస్తామంటేనే ఏడాది కాలంగా యాడ్స్ లో ఏ మాత్రం తేడా కనిపించలేదు.. ఇప్పుడు నిషేధం అంటే పట్టించుకుంటారా మన స్టార్ హీరోలు అండ్ హీరోయిన్సూ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/