• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తలైవా.. ఏదో ఒకటి...

తలైవా.. ఏదో ఒకటి తేల్చవయా..

By - Tupaki Desk
Update: 2018-01-16 08:50 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్.. భారీ చిత్రాల డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న 2.0 సినిమా రిలీజ్ ఒకడుగు ముందుకు.. ఇంకో అడుగు వెనక్కు అన్నట్టుగా ఎటూ తేల్చకపోవడం టాలీవుడ్ ను కలవర పెడుతోంది. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనే కాదు.. సౌత్ అంతటా భారీ అంచనాలే ఉన్నాయి.

కిందటి నెలలో అభిమానులతో రజనీ మీటయినప్పుడు ఏప్రిల్ 14న ఈ సినిమా రిలీజవుతుందని చెప్పారు. ఏప్రిల్ 27 నాటికి మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న భరత్ అనే నేను... అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న నాపేరు సూర్య రిలీజ్ చేస్తున్నట్లు ఆయా సినిమా నిర్మాతలు ప్రకటించారు. రజనీ సినిమా 14న విడుదలైతే రెండు వారాల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదని భావించారు. కానీ 2.0 రిలీజ్ ఇంకాస్త వెనక్కెళ్లి ఏప్రిల్ 27న వస్తుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇది మహేష్.. అర్జున్ సినిమాల నిర్మాతలను కలవరపరుస్తోంది. 2.0 నిర్మాతలేమో ఇంతవరకు అఫీషియల్ ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడమా.. రిలీజ్ వాయిదా వేయడమా తెలియక తెలుగు నిర్మాతలేమో కిందమీదా పడుతున్నారు.

ఒకేరోజున మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైతే చాలా పరిమిత థియేటర్లే లభిస్తాయి. సినిమా యావరేజ్ గా ఉందని టాక్ వచ్చినా దారుణమైన నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అదీగాక 2.0 మూవీకి ఉన్న క్రేజ్ ను బట్టి అత్యధిక థియేటర్లు ఆ సినిమాకే వెళ్లిపోతాయి.  ఈ పరిస్థితుల్లో లైకా ప్రొడక్షన్స్ కానీ.. హీరో రజనీ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Tags:    
  • Confusion 
  • Rajinikanth 
  • Robo 2.0 
  • Movie Release Date 
  • telugu news 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS