• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎటూ తేల్చుకోలేక పోతున్న...

ఎటూ తేల్చుకోలేక పోతున్న సురేశ్ బాబు!

By - Tupaki Desk
Update: 2021-10-24 23:30 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సురేశ్ బాబుకి ఉన్న పేరు ప్రఖ్యాతులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అపారమైన అనుభవం ఆయన సొంతం. తన బ్యానర్ కి సంబంధించిన సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్ర్రతగా ఉంటారు. ఆయన నిర్ణయాలు నియమాల్లా అనిపిస్తాయి. అంతగా ఆయన వాటిని అమలుపరుస్తూ ఉంటారు. కథా చర్చల దగ్గర నుంచి జనంలోకి సినిమా వెళ్లెవరకూ ఆయన కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. అలాంటి సురేశ్ బాబు, 'దృశ్యం 2' .. 'విరాటపర్వం' సినిమాల విడుదలను తేల్చకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఆ మధ్య తమిళంలో ధనుశ్ చేసిన 'అసురన్' సినిమా అక్కడ సంచలన విజయాన్నిసొంతం చేసుకోవడంతో, ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను తీసుకుని అదే నిర్మాతతో కలిసి సురేశ్ బాబు 'నారప్ప'ను నిర్మించారు. చాలా తక్కువ సమయంలో .. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తి చేయడం .. అసలు ఆ తరహా కథను ఎంచుకోవడం సురేశ్ బాబు ప్లానింగ్ లో భాగమే. ఆ సమయంలో థియేటర్ల పరిస్థితి కాస్త అటు ఇటుగా ఉండటంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వారికి అప్పగించేశారు. ఈ విషయంలో సురేశ్ బాబు చాలా ఫాస్టుగా నిర్ణయం తీసుకున్నారు.

ఇక ఇప్పుడు ఆయన చేతిలో 'దృశ్యం 2' .. 'విరాటపర్వం' సినిమాలు రెడీగా ఉన్నాయి. మలయాళంలో 'దృశ్యం' సీక్వెల్ గా  'దృశ్యం 2' చేసిన జీతూ జోసెఫ్, మరో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆయనే తెలుగులో 'దృశ్యం 2' సినిమాకి దర్శకత్వం వహించాడు. సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే కథ కావడం వలన, ఈ సినిమా కోసం వెంకటేశ్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పట్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఆత్రుత కనబరుస్తున్నారు. రానా కథానాయకుడిగా చేసిన 'విరాటపర్వం' కోసం ఎదురుచూసేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రానా నక్సలైట్ గా నటించడం ఒక విశేషమైతే, ఆయనను ప్రేమించే గ్రామీణ యువతిగా సాయిపల్లవి నటించడం మరో విశేషం,

ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో అంచనాలు పెంచాయి. అయితే ఈ రెండు కూడా ఓటీటీకి వెళతాయా? థియేటర్లకు వస్తాయా? అనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. వీటి విడుదల విషయాన్ని సురేశ్ బాబు ఇంతవరకూ తేల్చలేదు. థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఆయన ఈ సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇటీవల వచ్చిన 'లవ్ స్టోరీ' .. 'బ్యాచ్ లర్' భారీ వసూళ్లను రాబట్టడంతో, మళ్లీ ఆయన ఈ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్. మిగతా సినిమాలన్నీ కూడా కేలండర్లో ఏ డేట్ దగ్గర ఖాళీ దొరికితే అక్కడ కర్చీఫ్ వేసేసి సర్దుకున్నాయి. ఎక్కడా ఖాళీ లేకపోవడంతో సురేశ్ బాబు ఆలోచనలో పడటమే ఈ ఆలస్యానికి కారణమనే టాక్ కూడా వినిపిస్తోంది.
Tags:    
  • D Suresh Babu 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ENE Repeat Trailer: పర్ఫెక్ట్ కట్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS