`హిట్` సిరీస్ తీస్తాడట.. ఏంటా కాన్ఫిడెన్స్?
మొదటి చిత్రానికే అంత లేదు.. అయినా సిరీస్ తీస్తారట. ఇంత కాన్ఫిడెన్స్ ఏమిటో. ఫిబ్రవరి చివరి శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన విశ్వక్ `హిట్` మూవీ గురించి తెలిసిందే. రాంగ్ సీజన్ రాంగ్ రిలీజ్ అనుకుంటే కంటెంట్ పరంగానూ అంత పొడిచేసిందేమీ లేదన్న విమర్శలొచ్చాయి. దీంతో అనుకున్న స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకుల్లోకి వెళ్లలేదు. ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ కనెక్ట్ కాలేదని సోషల్ మీడియా వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం కరోనా దెబ్బ ఓ వైపు.. పరీక్షల దెబ్బ మరో వైపు కారణం ఏదైనా జనం థియేటర్ల వైపు చూసే పరిస్థితే లేదు. ఇక కరోనా ప్రభావం లేకముందే హిట్ సినిమా రిలీజైనా ఎందుకనో ఆశించినంత హిట్టవ్వలేదు. ఇక మొన్న శుక్రవారం రిలీజైన సినిమాలకు పదో తరగతి- ఇంటర్ పరీక్షల దెబ్బ మామూలుగా లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ టీనేజర్స్ తో పాటు ఎవరూ థియేటర్ల వైపు చూడటం లేదు. ఇక హిట్ రిలీజై రెండో వారం వరకూ అక్కడక్కడా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద జనం పలచగానే కనిపిస్తున్నారన్న టాక్ ఉంది. ఇక క్రిటికల్ గానూ హిట్ చిత్రానికి పెద్దగా వర్కవుట్ కాకపోవడం మరో మైనస్ అయ్యింది.
ఇక హిట్ మూవీకి సీక్వెల్ తీస్తామని .. సిరీస్ చేస్తామని అనడం ప్రస్తుతం చర్చకొచ్చింది. అసలు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే సాహసం నిర్మాత నానీ చేస్తారా? అంటే సందేహమే. కానీ దర్శకుడు శైలేష్ కొలను మాత్రం తాను హిట్ చిత్రానికి సీక్వెల్ తీస్తానని చెబుతున్నారు. ఒక వైపు హిట్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా సిరీస్ తీయాలన్న ప్లాన్ సరైనదేనా? `అ!` లాంటి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన చిత్రానికి సీక్వెల్ తీయాల్సినది. కానీ నానీ ఆ ప్రయత్నం విరమించారు. ఇప్పుడు హిట్ సీక్వెల్ తీస్తారా? అంటూ అభిమానులు పెదవి విరిచేస్తున్నారు. శైలేష్ కొలను లాంటి యంగ్ ట్యాలెంట్ ఇన్నోవేటివ్ గా ఆలోచించినా కొన్నిసార్లు వర్కవుట్ అవ్వని సన్నివేశం ఉంది. శైలేష్ రెండో ఛాన్స్ ఎవరితో అన్నది చూడాలి.