• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆలియా ఫ్నెగ్నెన్సీపై...

ఆలియా ఫ్నెగ్నెన్సీపై కండోమ్ కంపెనీ హ‌డావుడి!

By - Tupaki Desk
Update: 2022-06-27 14:58 GMT
అలియా భట్ - రణబీర్ కపూర్ బాలీవుడ్ లో అత్యంత పాపులారిటీ ఉన్న జంట‌గా సుప‌రిచితం. ప్రస్తుతం లవ్ బర్డ్స్ పేర్లు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో హెడ్ లైన్స్ లోకి వ‌స్తున్నాయి. తాజాగా తమ మొదటి బిడ్డను స్వాగతించనున్నామ‌ని ఆలియా  ప్ర‌క‌టించారు. ఈ విషయాన్ని ఆలియా తన సోషల్ మీడియా లో ప్రకటించింది. 29 ఏళ్ల ఆలియా తన భర్త ర‌ణ‌బీర్ కపూర్ తో కలిసి వారి సోనోగ్రఫీ సెషన్ నుండి ఒక ఫోటోని షేర్ చేసింది. ``మా పాప.. త్వరలో వస్తుంది`` అని ఆలియా వ్యాఖ్య‌ను జోడించింది.

ఈ ఫోటోగ్రాఫ్ లో ఆలియా మానిటర్ ని ఆనందంగా చూస్తోంది. ఆలియా... సింహం కుటుంబానికి చెందిన మరొక ఫోటోను పంచుకుంది. అక్కడ సింహం సింహాన్ని తట్టి లేపుతుండ‌గా అందులో సింహం పిల్ల వాటిని చూస్తోంది. ఇది ఎంతో ఫ‌న్నీగానూ క‌నిపించింది.

ఏప్రిల్ 14న ముంబైలోని ఆర్కే హౌస్ లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంత‌లోనే ఫ్రెగ్నెన్సీ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. గ‌ర్భ‌ధార‌ణ వార్త తెలియ‌గానే బాలీవుడ్ ప్ర‌ముఖులంతా ఈ జంటను అభినందించారు. ఒక కండోమ్ కంపెనీ నుండి ఆసక్తికరమైన అభినందన సందేశం అందింది. స‌ద‌రు కండోమ్ కంపెనీ ఇన్ స్టాగ్రామ్ లో ``మెహ్ ఫిల్ మే తేరీ…హమ్ తోహ్ క్లియర్లీ నహీ ది`` అని పోస్ట్ చేసింది. పోస్టర్ పై ``అభినందనలు #రణబీర్- అలియా`` అని రాసి ఉంది. కండోమ్ కంపెనీ తెలివైన టైమింగ్ తో ఇలా ప్ర‌చారానికి దిగింది. ఆ తెలివైన మార్కెటింగ్ ఐడియా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ప్ర‌ఖ్యాత అమూల్ అటువంటి తెలివైన‌ ప్రకటనల‌తో పాపుల‌రైనా ఇప్పుడు ఈ కండోమ్ కంపెనీ దీనిని అనుస‌రిస్తోంది.

2019లో అలియా తన బెస్ట్ ఫ్రెండ్ కం నటి ఆకాంక్ష రంజన్ తో తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో ఆలియా భవిష్యత్తులో పిల్లలను కనడంపై హింట్ ఇచ్చింది. ప్ర‌శ్నోత్త‌రాల్లో ఆ ఇద్ద‌రికీ ఒక  ప్ర‌శ్న ఎదురైంది. మీకు ఎంద‌రు పిల్లలు కావాలి? అని అడ‌గ్గా `ఇద్ద‌రు అబ్బాయిలు` అని ఆకాంక్ష తెలిపారు. `రెండు` అంటూ ఆలియా నంబ‌ర్ వేసారు.

అలియా - రణబీర్ ఈ సంవత్సరం ఏప్రిల్ 14 న వివాహం చేసుకోవడానికి ముందు ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు. 2017లో వారి ఫాంటసీ-డ్రామా చిత్రం బ్రహ్మాస్త్ర సెట్స్ కి వెళ్లింది. సెట్స్ లోనే వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. రణబీర్ - ఆలియా జంటకు మొట్ట‌ మొదటి అవ‌కాశం ఇది. ఈ చిత్రం ఐదు భారతీయ భాషలలో విడుద‌ల‌వుతోంది. హిందీ- తమిళం- తెలుగు- మలయాళం - కన్నడ భాషలలో సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- నాగార్జున - మౌని రాయ్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
Tags:    
  • Alia bhatt 
  • Ranbir kapoor 
  • tollywood 
  • bollywood 
  • actress 
  • movie news 
  • latest news 
  • tupaki news 

Similar News

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

ఏడాదిలో నాలుగు... శర్వా రికార్డ్‌ అయ్యేనా?

2026-11-14 16:27 GMT

చిరు టాక్‌ షో.. సెకండ్‌ ఎపిసోడ్‌ వీళ్లతోనే!

2026-11-14 16:26 GMT

పోలీస్ ఆఫీసర్‌గా ఫిదా చేసేనా?

2026-11-14 16:26 GMT

హీరో అన్నారు...విలన్ ని చేశారు

2026-11-14 16:26 GMT

Copyright @2026

Powered by Blink CMS