• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరో అన్నారు...విలన్ ని...

హీరో అన్నారు...విలన్ ని చేశారు

| 1972లో హీరో కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన గిరిబాబుకు తొలుత హీరో అవకాశం ఇస్తామని చెప్పి, ఆ తర్వాత విలన్ పాత్ర ఇచ్చారు. 1973లో విడుదలైన ‘జగమే మాయ’తో నటుడిగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి అగ్ర హీరోలతో నటించారు. కృష్ణతో 150కి పైగా సినిమాల్లో కలిసి పనిచేశారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, కథకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

By - Satya P
Update: 2026-11-14 16:26 GMT

ప్రముఖ నటుడు గిరిబాబు శనివారం మృతి చెందారు. ఆయన అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన నటుడు అని వేరేగా చెప్పాల్సింది లేదు. యాభై ఏళ్ళ పాటు తన నటనతో తెలుగు సినీ రంగంలో ముఖ్య భూమిక పోషించారు. ఇదిలా ఉంటే నటుడు కావాలని ప్రతీ వారూ కోరుకుంటారు. అందులో హీరో కావాలని కూడా ఇంకా బలంగా కోరుకుంటారు. అలాగే గిరిబాబు 1972లో ఒక సంస్థకు ఇంటర్వ్యూకు వెళ్ళారు. అక్కడ ఆయన ఫిజిక్ ని ఆయన నటనను చూసి మీరే మా సినిమాలో హీరో అన్నారు. ఆ ఆనందంతో గిరిబాబు తన సొంత ఊరు ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు వెళ్ళి స్నేహితులు అందరితో చెప్పుకుని సంబరపడ్డారు. అయితే కొన్ని రోజుల్ తరువాత ఆయనకు ఆ సంస్థ చెప్పింది ఏమిటి అంటే ఈ సినిమాలో మీరు హీరో కాదు విలన్ అని. దాంతో నిరాశ నిండా ఆవహించినా సర్దిచెప్పుకొని ఎలాగైనా ఇండస్ట్రీకి పరిచయం కావాలని ఓకే చెప్పారు గిరిబాబు. ఆ మూవీయే జగమే మాయ. అది 1973లో రిలీజ్ అయి తెలుగు సినిమాకు ఒక అందమైన విలన్ ని అందించింది.

తనదైన స్టైల్ తో :

అప్పటిదాకా విలన్లు అంటే కోర మీసాలతో గల్ల లుంగీతో భయంకరమైన నవ్వుతో దడ పుట్టించేవారు. కానీ గిరిబాబు ఎంట్రీ తరువాత విలన్ కూడా ఇంత అందంగా ఉంటాడా అనిపించారు. ఆయన తనదైన డైలాగ్ మాడ్యులేషన్ తో విలనీని అద్భుతంగా పండించారు. అలా ఒకటి రెండూ కాదు వందల సినిమాల్లో నటించారు. విలన్ గా ఎంతో మంది వచ్చినా గిరిబాబు ప్లేస్ సెపరేట్ అన్నట్లుగా ఒక పేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆనాటి టాలీవుడ్ అగ్ర నటులు ఎన్టీఅర్ అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారితో ఎన్నో సినిమాల్లో నటించి గిరిబాబు పేరు తెచ్చుకున్నారు.

క్రిష్ణతో రికార్డు :

అంతే కాదు సూపర్ స్టార్ క్రిష్ణతో కలసి గిరిబాబు దాదాపుగా 150 చిత్రాలకు పైగా నటించి మెప్పించారు. క్రిష్ణ గిరిబాబుల మధ్య స్నేహం ఎంతో గొప్పగా ఉండేది. క్రిష్ణ తన సినిమాల్లో గిరిబాబుకు ఏదో ఒక పాత్రను ఉండేలా చూసుకునేవారు అంటారు. ఒక వేళ కథాపరంగా పాత్ర లేకపోయినా ఏదో విధంగా పాత్రని క్రియేట్ చేసి మరీ గిరిబాబుని తన సినిమాల్లో ఉంచేవారు అంటే వీరి ఫ్రెండ్ షిప్ ని ఎంతగా అయినా ఊహించుకోవచ్చు. గిరిబాబు కూడా తాను నిర్మాతగా చేసిన సినిమాలో కృష్ణ ను హీరోగా పెట్టి సింహ గర్జన తీశారు. అయిదు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ జానపద చిత్రం సూపర్ హిట్ అయింది.

దర్శకుడిగా సైతం :

గిరిబాబు దర్శకుడిగా కూడా రాణించారు. రణరంగం మూవీతో ఆయన తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నారు. భానుచందర్, సుమలత గిరిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తన రెండవ కుమారుడు బోసు బాబుని హీరోగా చేయాలని ఆయన ఎంతో కష్టపడి తీసిన ఇంద్రజిత్ మూవీ గురించి అప్పట్లో ఎక్కువగా చెప్పుకునేవారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కౌబాయ్ అడ్వెంచర్ మూవీగా దీనిని రూపొందించారు. అదే విధంగా నీ సుఖమే నే కోరుతున్నా పేరుతో 2008లో ఆయన చివరి సారిగా స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన కుటుంబ కథా చిత్రం ఉంది.

విలక్షణ నటుడు :

గిరిబాబు విలక్షణ సలక్షణ నటుడిగా చెప్పుకోవాలి. ఆయనలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. విలన్ గా ఎంతలా అలరించాయో ఆయన కామెడీతో అంతకు మించి అన్నట్లుగా మెప్పించారు. అలాగే క్యారక్టర్ యాక్టర్ గా ఆయన ఎన్నో మంచి పాత్రలను పోషించారు. కేవలం నటుడిగానే కాదు కధకుడిగా దర్శకుడిగా అభిరుచి కలిగిన నిర్మాతగా గిరిబాబు టాలీవుడ్ లో మంచి స్థానాన్ని అందుకున్నారు. ఇక హీరోగా ఆయన నటించిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. అందులో వధూవరులు, రామ రాజ్యంలో రాబంధులు మునసబు గారి అల్లుడు వంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు.

Tags:    
  • giribabu 
  • tollywood 
  • jagamemaya 
  • veteranactor 
  • giribabudeath 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS