ఇండస్ట్రీలో పోటీ నాకు 'ఛాలెంజింగ్'గా ఉంది: జాన్వీకపూర్

Update: 2021-02-28 03:12 GMT
బాలీవుడ్ కుర్రభామ జాన్వీకపూర్.. దడక్ సినిమాతో అరంగేట్రం చేసినప్పటి నుండి ఆమె రోజురోజుకి క్రేజ్ పెంచుకుంటూనే ఉంది. ఫస్ట్ సినిమా నుండి కూడా జాన్వీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ.. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు సినీప్రయాణంలో పోటీ గురించి మాట్లాడింది జాన్వీ. ఆమె మాట్లాడుతూ.. 'ఎవరైనా పరిశ్రమలో అడ్జెస్ట్ అవ్వగలరని నేను నిజంగా నమ్ముతున్నాను. ఇద్దరు లేదా ఎక్కువమంది ఒకే సినిమా పై దృష్టి పెట్టాల్సి రావచ్చు. కానీ సినిమాలు ఇవన్నీ జీవితంలో ఒక భాగం. పోటికంటే నటించిన చిత్రానికి ఉత్తమంగా ఏం ఇచ్చాము.. మనం కోరుకున్న విధంగా సినిమా వచ్చిందా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీలో పోటీ అనేది ఆరోగ్యంగానే ఉంది' అంటూ చెప్పుకొచ్చింది.

జాన్వీకి సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. అందుకే రెగ్యులర్ గా అభిమానులకు అందుబాటులో ఉంటోంది. దడక్ సినిమా తర్వాత జాన్వీ చేసిన ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్" రెండు సినిమాలు ఓటిటిలో విడుదల అయ్యాయి. ప్రస్తుతం రూహి అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తోంది జాన్వీ. అమ్మడికి ఇంస్టాగ్రామ్ లో 9.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్ని తొలి అడుగులుగా భావిస్తున్నాను. ఇంకా నేను చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. తాజాగా అలియా భట్ నటించిన గంగుబాయి కతీయవాడి టీజర్ చూసాను. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అలియా చేసిన యాక్టింగ్ దేశవ్యాప్తంగా కంచెలు తెంచేసిందని చెప్పాలి. అలియా తన నటనతో ఈ దదేశంలో, ఇండస్ట్రీలో బారులు చేరిపేసింది' అంటూ కొనియాడింది.
Tags:    

Similar News