క‌మెడియ‌న్ ట‌ర్న్ డ్ హీరో `గూడుపుఠాణి` ఎవ‌రిపై?

Update: 2021-07-04 15:30 GMT
క‌మెడియ‌న్ ట‌ర్న్ డ్ హీరో స‌ప్త‌గిరి కొంత గ్యాప్ త‌ర్వాత న‌టిస్తున్న సినిమా గూడుపుఠాణి. సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన క్లాసిక్ మూవీ టైటిల్ ఇది. ఎస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్థిరాస్తి వ్యాపారులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి- కటారి రమేష్ నిర్మిస్తున్నారు. కుమార్ కె.ఎం ద‌ర్శ‌కుడు. నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ సూప‌ర్ స్టార్ కృష్ణ చేతుల‌మీదుగా విడుదలైంది.

ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ...``సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అదే టైటిల్ తో నేను సినిమా చేయడం విశేషం. కృష్ణ గారు మా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడు కుమార్ కె.ఎం ఆసక్తికరంగా మూవీని తెరకెక్కించారు`` అని తెలిపారు.

సప్తగిరి చక్కగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. హంపి,- మైసూర్,- మేల్కొటి,- కంచి,- చిక్మంగళూరు పరిసర అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తీశామని నిర్మాత‌లు తెలిపారు. నా మొదటి సినిమా గూడుపుఠాణి డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీయ‌డం ఆనందంగా ఉంద‌ని.. ఆడియన్స్  థ్రిల్ ఫీల్ అవుతారని ద‌ర్శ‌కుడ‌న్నారు. రిచ్ గా రావడానికి నాకు హెల్ప్ అయ్యారు.. సూపర్ స్టార్ మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం నేను మర్చిపోలేని అనుభూతినిచ్చింద‌ని తెలిపారు. పవన్ చెన్న ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌గా.. ప్రతాప్ విద్య సంగీతం అందించారు.
Tags:    

Similar News