మహాకవిని అచ్చుగుద్దిన టాలీవుడ్ హాస్యబ్రహ్మ!
నటనలో అన్నిటికంటే హాస్యాన్ని పండించడం చాలా కష్టతరం అంటుంటారు. కానీ హాస్యానికి కూడా నవ్వు తెప్పించే నటన ఆయన సొంతం. ఆయన పేరు వింటే చాలు తెలుగు ప్రజలకు పెదాలపై తెలియకుండానే నవ్వొస్తుంది. కడుపుబ్బ నవ్వించే ఆయన స్క్రీన్ పై కనిపిస్తే విజిల్స్ తో థియేటర్లు మారుమోగుతాయి. ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది కదా.. ఆయనెవరో.. ఆయనే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. లెక్చరర్ స్థానం నుండి గొప్ప కమెడియన్ గా ఎదిగిన ఆయనలో ఎన్నో కళలు దాగి ఉన్నాయి. ఆయనలో గొప్ప చిత్రకారుడు కూడా ఉన్నాడని తాజాగా నిరూపించారు.
లాక్‌డౌన్ సమయాన్ని బ్రహ్మానందం చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. కొందరు తమలో దాగి ఉన్న టాలెంట్‌ని బయటకి తీస్తుంటే, మరికొందరు వేరు వేరు విభాగాలలో నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హాస్యబ్రహ్మా బ్రహ్మానందం లాక్‌డౌన్ సమయంలో తనలోని టాలెంట్‌ని బయటపెట్టి అభిమానులని ఆశ్చర్యపరిచారు. స్వతహాగా తెలుగు సాహిత్య నిపుణుడైన బ్రహ్మానందంకి దిగ్గజ కవి శ్రీశ్రీ పై అభిమానం ఎక్కువ. లాక్‌డౌన్ సమయంలో మహాకవి పై ఉన్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టారు. ఇంట్లో కూర్చొని శ్రీశ్రీ బొమ్మను పెన్సిల్ స్కెచ్ వేశాడు. లాక్ డౌన్ పీరియడ్ వల్ల నాన్న మహాకవి శ్రీశ్రీ చిత్రాన్ని గీయడం చాలా సంతోషంగా ఉందంటూ.. సోషల్ మీడియా వేదికగా బ్రహ్మీ గీసిన శ్రీశ్రీ గారి ఫోటోను పంచుకున్నారు గౌతమ్. బ్రహ్మానందం టాలెంట్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.