ఎఫ్‌3 కాస్టింగ్‌ మార్పుల పై క్లారిటీ

Update: 2020-12-20 10:30 GMT
గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్‌ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలోనే ఎఫ్‌ 3 ని ప్రకటించిన అనీల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఎఫ్‌ 3 ని మొదలు పెట్టాలనుకున్నాడు. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఎఫ్‌ 3 సినిమా ఎట్టకేలకు ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభంకు అంతా సిద్దం అవుతుంది. ఈ సినిమాలో వెంకటేష్‌.. వరుణ్‌ తేజ్‌ లతో పాటు మరో హీరో గెస్ట్‌ రోల్‌ లో కాని ఫుల్‌ లెంగ్త్‌ రోల్ లో కాని కనిపించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. గోపీచంద్‌.. రవితేజలతో దర్శకుడు చర్చలు జరిపాడనే వార్తలు వచ్చాయి. వీరిద్దరిలో ఒకరు ఎఫ్‌ 3 లో మూడవ హీరోగా కనిపించే అవకాశం ఉందనే వార్తలు జోరుగా వచ్చాయి.

తాజాగా షూటింగ్‌ ప్రారంభం అవ్వడంతో పుకార్లన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పడింది. సినిమాలో మూడవ హీరో ఎవరు ఉండరని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్‌ 3 సినిమా లో హీరోయిన్‌ విషయంలో కూడా కాస్త చర్చ జరిగింది. షూటింగ్‌ ప్రారంభోత్సవంకు మెహ్రీన్‌ రాకపోవడంతో ఆమెను ఈ సినిమా నుండి తప్పించారనే ప్రచారం జరిగింది. కాని అది కూడా నిజం కాదని తేలిపోయింది. ఎఫ్‌ 2 లో నటించిన హీరోలు హీరోయిన్స్‌ నలుగురు ఎఫ్‌ 3 లో కనిపించబోతున్నారు. అంతకు మించి అన్నట్లుగా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.
Tags:    

Similar News