లాక్ డౌన్ లో లెజండ్రీ నటి కొడుకు ఆత్మహత్యాయత్నంపై స్పష్టత

Update: 2020-04-10 06:30 GMT
ప్రముఖ సీనియర్ కోలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ దివంగత మనోరమ కుమారుడు భూపతి చెన్నైలోని తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఇవి కలకలం రేపాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ లో భూపతి ఆత్మహత్యాయత్నానికి కారణమేంటనే ప్రశ్న అందరినీ తొలిచివేసింది.

అయితే తాజాగా భూపతి కుమారుడు రాజరాజన్ తాజాగా స్పష్టతనిచ్చారు. తన తండ్రి భూపతి ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ తో మద్యం బంద్ అయ్యిందని.. తన తండ్రి మద్యానికి బానిస అయ్యి దాని ఉపసంహరణ లక్షణాలతో బాధపడుతున్నాడని... సరైన నిద్ర పోవడానికి నిద్రమాత్రలు తీసుకున్నారని రాజరాజన్ తెలిపారు. మోతాదు మించి పోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించామన్నారు. అతడి పరిస్థితి స్థిరంగా ఉందని భూపతి కుమారుడు తెలిపారు. 
Tags:    

Similar News