డైరెక్టర్లనే దారిలోకి తెచ్చుకున్న హాట్ లేడీ!
సినిమాకి డైరెక్టర్ అంటే? కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాంటి వాడు. ప్రాజెక్ట్ లాక్ అయిన తర్వాత ఆ క్షణం నుంచి కెప్టెన్ చెప్పినట్లు నటులంతా చేయాల్సిందే. అతడి విజన్ కు తగ్గట్టు నడుచుకోవాల్సి ఉంటుంది.;
సినిమాకి డైరెక్టర్ అంటే? కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాంటి వాడు. ప్రాజెక్ట్ లాక్ అయిన తర్వాత ఆ క్షణం నుంచి కెప్టెన్ చెప్పినట్లు నటులంతా చేయాల్సిందే. అతడి విజన్ కు తగ్గట్టు నడుచుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మౌల్డ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంత పెద్ద హీరో అయినా? హీరోయిన్ అయినా? ఎలాంటి మినహాయింపులు ఉండవు. అంతిమంగా అంతా కలిసి ఓ గొప్ప ప్రాజెక్ట్ ని తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి నిబంధనలు తూచ తప్పకుండా పాటించాల్సిందే. కుంటిసాకులు చెబితే? మేకర్స్ ఎంత మాత్రం అంగీకరించరు.
ఎవరా నటి అంటే?
నచ్చకపోతే నిర్మొహమాటంగా వెళ్లిపోమని ముఖం మీదనే చెప్పేస్తారు. ఈ విషయంలో ఎంత మాత్రం రాజీ పడరు. అంతటి కఠినాత్ముల్నే మార్చేసింది ఓ నటి అంటే నమ్ముతారా? అవును. ఇంతకీ ఎవరా నటి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. టాలీవుడ్ లో తాప్సీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో తెలుగు సినిమాలకు టాటా చెప్పి బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ మాత్రం నటిగా బిజీగా ఉంది. కానీ ఇంకా అక్కడా తనదైన ముద్ర వేయలేదు. ఆప్రయత్నాల్లో బిజీగా ఉంది.
సినిమాలకు పనికిరావ్ అన్నారు:
అయితే ఈ బ్యూటీ కి తన హెయిర్ స్టైల్ అన్నది కొన్నాళ్ల పాటు ఓ శాపంగా మారిందని చెప్పుకొచ్చింది. ఉంగరాల జుట్టు కారణంగా ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయానంది. రింగుల జుట్టు కేవలం యాక్షన్ పాత్రలకే సరిపో తుందని..మిగతా సినిమాలకు పనికి రాదని చాలా అవకాశాలు పోగోట్టుకుందిట. ఈ క్రమంలో ఛాన్సుల కోసం హెయిర్ ని స్ట్రెయిట్ చేయించినట్లు గుర్తు చేసుకుంది. వాస్తవానికి ఉంగరాల జుట్టు అంటే తనకీ నచ్చేది కాదట. కానీ ఉంగరాల జుట్టు ప్రత్యేకత తెలుసుకుని కాలక్రమంలో ఆ హెయిర్ ని ప్రేమించడం మొదలు పెట్టినట్లు తెలిపింది.
ఉంగరాలు ఇప్పుడో వరం:
ఉంగరాలను ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుని తెలుసుకుని, నెమ్మదిగా దర్శకులను కూడా దారిలో పెట్టినట్లు పేర్కొంది. కొన్ని నెలల తర్వాత కొంత మంది దర్శకులు ఉంగరాల జుట్టు ఉన్న హీరోయిన్ మాత్రమే కావాలని వాళ్లతోనే అనిపించిందట. సహజంగా ఉండే హెయిర్ గొప్పతనం వారికి చెప్పడంతో చాలా మంది కన్విన్స్ అయ్యారని తెలిపింది. ఇప్పుడు ఉంగరాలు తీసేయాలా? ఉంచాలా? అనే ఆప్షన్ దర్శకులకు ఇస్తుంటే? వద్దు వద్దు ఉంగరాలు లేకపోతే ఎలా? అదే నీ ప్రత్యేకత అంటూ పొగిడేస్తున్నారంది. సినిమాల్లోనే కాదు..కొన్ని బ్రాండ్లు కూడా తన హెయిర్ స్టైల్ చూసి అగ్రిమెంట్లు చేసుకుంటాయని తెలిపింది. ఇప్పుడు ఉంగరాల జుట్టును ఓ వరంగా భావించినట్లు పేర్కొంది.