• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చుట్టాలబ్బాయి భయపడ్డాడు

చుట్టాలబ్బాయి భయపడ్డాడు

By - Tupaki Desk
Update: 2016-07-31 07:47 GMT
ఓపక్క విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘మనమంతా’ ఆసక్తి రేపుతోంది. మరోవైపు అల్లు శిరీష్ సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’ మీద కూడా పాజిటివ్ బజ్ కనిపిస్తోంది. ఈ రెండూ ఫీల్ గుడ్ సినిమాల్లాగా.. కొంచెం విభిన్నంగా కూడా కనిపిస్తున్నాయి. పైగా ఈ రెండు సినిమాలకు పబ్లిసిటీ కూడా బాగా చేసి జనాల్లో ఆసక్తి అంతకంతకూ పెంచుతున్నారు. కానీ ఈ రెంటికీ పోటీగా రావాల్సిన ‘చుట్టాలబ్బాయి’ గురించే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అది చూడ్డానికి రొటీన్ సినిమాలా కనిపిస్తోంది. పైగా హీరో ఆది వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. దర్శకుడు వీరభద్రం చౌదరి గత సినిమా ‘భాయ్’ రిజల్ట్ ఏంటో కూడా చెప్పాల్సిన పని లేదు. దీంతో సినిమాకు అనుకున్న స్థాయిలో ఊపు రాలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో ‘చుట్టాలబ్బాయి’ని ఆగస్టు 5న రిలీజ్ చేయడం సాహసమే అని అంటున్నారంతా. ఈ వాస్తవం గ్రహించి సినిమా విడుదల వాయిదా వేసేసింది ‘చుట్టాలబ్బాయి’ టీం. ఈ చిత్రాన్ని ఆగస్టు 19న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఆది గత సినిమా ‘గరం’.. నాని సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో పోటీ పడి అడ్రస్ లేకుండా పోయింది. ఐతే సినిమా బాగుంటే ఎప్పుడొచ్చినా పర్వాలేదనుకోండి. ఈ రోజుల్లో పోటీ లేకుండా సినిమా రిలీజ్ చేసుకోవడం కష్టం. కాకపోతే ఉన్నంతలో బెటర్ డేట్ చూసుకోవడం బెస్ట్. ఐతే ఆగస్టు 19న కూడా ఖాళీ ఏమీ లేదు. ఆల్రెడీ సుశాంత్ సినిమా ‘ఆటాడుకుందాం రా’ షెడ్యూల్ అయి ఉంది. అదొక్కటే వచ్చేట్లయితే ఇబ్బందేమీ లేదు. కానీ నాగచైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆ రోజే రిలీజ్ అంటున్నారు. నిజంగా ఆ సినిమా ఆ రోజు విడుదలయ్యేట్లుంటే మాత్రం.. ఆది ఇంకో డేట్ చూసుకోవాల్సిందే.
Tags:    
  • Adi 
  • Chuttalabbayi Movie 
  • Telugu NEWs 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS