సమంత స్పెష‌ల్ నంబ‌ర్ కోసం మ‌సాలా స్పెష‌లిస్ట్!

Update: 2021-11-30 02:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌- ది రైజ్`. ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డిసెంబ‌ర్ 17న ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. అంత‌కుముందు ఈ సినిమా కోసం అదిరిపోయే స్పెష‌ల్ నంబ‌ర్ ని తెర‌కెక్కించ‌నున్నారు. దీనికోసం సమంత‌ను బ‌రిలో దించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ పాట‌కు కొరియోగ్రాఫ‌ర్ ఎవ‌రు? అన్న‌ది ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర విష‌యం తెలిసింది. మాస్ స్టెప్పుల‌కు ప్ర‌సిద్ధి చెందిన జానీ మాస్ట‌ర్ లేదా క్లాస్ డ్యాన్సుల‌కు పెట్టింది పేరైన శేఖ‌ర్ మాస్టార్ ఎవ‌రో ఒక‌రు కొరియోగ్రాఫ్ చేస్తార‌ని భావించారు. కానీ బ‌న్ని నేరుగా బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేష్ ఆచార్య‌ను బ‌రిలో దించారు. ఆయ‌న ఇంత‌కుముందు డీజే -దువ్వాడ జగన్నాథమ్ లోని గుడిలో బ‌డిలో పాట‌కు స్టెప్స్ కంపోజ్ చేశారు. బ‌న్నీతో ఎన్నో హిట్ పాటలకు కలిసి పనిచేశారు. కాబట్టి ఇప్పుడు మ‌రో లెవ‌ల్ అనిపించే పాట‌ను ఈ జోడీ నుంచి అభిమానులు ఆశించే వీలుంది.

నేటి నుండి ఈ ఐటెమ్ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. పాట చిత్రీక‌ర‌ణ కోసం ఇప్ప‌టికే భారీ సెట్ ను వేశారు.

స‌మంత నృత్యాలు.. దేవిశ్రీ మార్క్ మాస్ ట్యూన్ .. అద్భుతమైన విజువల్స్ తో ఈ పాట ఒక ఊపు ఊపుతుంద‌నే భావిస్తున్నారు. అల్లు అర్జున్ - సమంత జంట డ్యాన్స్ అభిమానులకు స్పెష‌ల్ ట్రీట్ ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు. స‌మంత కొన్ని వ‌ర‌స ఘ‌ట‌న‌ల అనంత‌రం ఇటీవ‌ల షూటింగుల‌తో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. డిసెంబర్ 17న పుష్ప థియేట‌ర్లలోకి రానుంది. అదే రోజు బాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు పోటీకి దిగ‌నున్నాయి.


Tags:    

Similar News