డిబేట్‌: గేయ ర‌చ‌యిత‌ను అన్ ఫాలో చేసిన‌ చిరు!

Update: 2021-04-04 04:39 GMT
సోష‌ల్ మీడియా యుగంలో ప్ర‌తిదీ పెద్ద డిబేటే. ఫాలో చేస్తే డిబేట్.. అన్ ఫాలో చేస్తే డిబేట్. మంచి చెడు రెండిటిపైనా డిబేట్. ఇప్పుడు అలాంటి చ‌ర్చ‌ ఒక‌టి అంత‌ర్జాలంలో మెగా ఫ్యాన్స్ న‌డుమ వాడి వేడిగా ర‌న్ అవుతోంది.

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ లిరిసిస్ట్ గా రామ‌జోగ‌య్య శాస్త్రికి ఉన్న గుర్తింపు గౌర‌వం గురించి తెలిసిందే. ఆయ‌న మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య కోసం `లాహే లాహే..` అనే గీతాన్ని ర‌చించారు. ఈ పాట చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ వేడుకలకు జోడిస్తూ.. ట్విట్టర్ లో చిరు అనుసరిస్తున్న ఏకైక వ్యక్తి తాను మాత్ర‌మే అని రామజోగయ్య అన‌డం అభిమానుల్లో డిబేట్ గా మారింది. త‌న‌ను చిరు అనుస‌రించ‌డంతో కొండంత సంతోషంగా ఉంద‌ని రామజోగయ్య ఆనందం వ్య‌క్తం చేశారు.

అయితే.. మెగాస్టార్ డిజిటల్ ప్లాట్ ‌ఫామ్ ‌లోని ప్రముఖులందరిలో ఒక గీత రచయితను అనుసరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా మంది అది పొరపాటుగా జ‌రిగిన‌దా? అని సందేహంచారు. అంతేకాదు.. రామజోగయ్య శాస్త్రి ఆనందం క్ష‌ణ‌కాల‌మే అనిపించేలా.. చిరు వెంటనే గేయ రచయిత ట్విట్టర్ హ్యాండిల్ ‌ను అనుసరించక‌పోవ‌డం మ‌రోసారి డిబేట్ కి దారి తీసింది. ట్విట్ట‌ర్ లో ట్రోల‌ర్స్ క‌ల్చ‌ర్ మ‌రోసారి వేడి పెంచుతోంది.

అయితే లాహే లాహే పాట‌కు మెగా ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ట్రోల‌ర్స్ క‌ల్చ‌ర్ ఎలా ఉన్నా కానీ ఈ పాట‌తో లిరిసిస్ట్ మెగాభిమానుల‌ మ‌న‌సు దోచార‌న్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. దీంతో రామ‌జోగయ్య ఆనందానికి అవ‌ధులే లేవు. ``ఇన్ని ఫోన్ కాల్స్ ఇన్నేసి అభినందనలు ఎప్పుడూ రాలే ..ఇంతమంది శ్రేయోభిలాషులు నన్నిష్టపడేవాళ్లు ఉన్నారన్న మాట`` అని ఆనందం వ్య‌క్తం చేసారు. ఆ పాట రాసే అవ‌కాశం ఇచ్చినందుకు కొర‌టాల చిరంజీవి బృందానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Tags:    

Similar News