2020 దసరా పందెం: చిరు వర్సెస్ బాలయ్య
సంక్రాంతి పందెం లో మహేష్ - బన్ని మధ్య ఠఫ్ ఫైట్ గురించి తెలిసిందే. జనవరి ఎండింగ్ వరకూ ఈ వార్ గురించే అభిమానులు ఆసక్తి గా మాట్లాడుకున్నారు. ఇకపై సమ్మర్ వార్.. ఆ తర్వాత దసరా వార్ అంటూ వేడెక్కించే సన్నివేశం ముందుంది. తాజా సమాచారం ప్రకారం.. దసరా వార్ ఈసారి మెగాస్టార్ చిరంజీవి- నటసింహా నందమూరి బాలకృష్ణ మధ్య ఖాయమైందనే చెబుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కథా నాయకుడిగా నటించనున్న 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. మెగాస్టార్ ముందే నిర్ణయించిన 99 రోజుల డెడ్ లైన్ లోపు కొరటాల చిత్రీకరణ సాంతం పూర్తిచేయాల్సి ఉంది. టార్గెట్ ప్రకారం.. యూనిట్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సహా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక డెడ్ లైన్ ప్రకారం ఏప్రిల్ నాటికి చిత్రీకరణ పూర్తిచేసి జూన్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్లాన్ . ఒకవేళ అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే అయితే మాత్రం దసరా కానుకగానే సినిమాను రిలీజ్ చేస్తామని కోరటాల తాజాగా సంకేతాలు అందించారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ టార్గెట్ సమ్మర్ మిస్ అయితే దసరా అని ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే దసరా బరిలో మెగాస్టార్ కి పోటీ ఎవరు? అని ఆరా తీస్తే... నటసింహా నందమూరి బాలకృష్ణ ఠఫ్ ఫైట్ ని ఇవ్వనున్నారన్న లీక్ అందింది.
బాలకృష్ణ- బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ ప్రస్తుతం హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో ఉన్నారు. సింహ- లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కాంబినేషన్ కాబట్టి తాజా చిత్రం ఎన్.బీ.కే 106 పై భారీ అంచనాలకు ఆస్కారం ఉంది. ఈ ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. దసరా నాటికి అన్ని పనులు పూర్తిచేసి రిలీజ్ చేయాలన్నది బోయపాటి ప్లాన్ అని తెలిసింది. అదే జరిగిదే చిరు-బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ ఖాయమైనట్టే. నిజానికి చిరు-బాలయ్య ప్రతిసారీ సంక్రాంతి పందెంలో దూసుకొచ్చేవారు. చివరిగా 2017 సంక్రాంతి కి ఆ ఇద్దరూ పోటీ పడిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150.. నటసింహ గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాలు 2017 జనవరిలో ఒక రోజు గ్యాప్ తో విడుదలై ఇరు చిత్రాలూ మంచి సక్సెస్ అందుకున్నాయి. ఖైదీ నంబర్ 150 మెగాస్టార్ కెరీర్ బెస్ట్ గా నిలిస్తే.. గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటి గా నిలిచింది. ఈసారి 2020 దసరా పందెం లో ఆ ఇద్దరూ వారియర్స్ గా బరిలో దిగే ఛాన్సుందన్న ఊహాగానాల నడుమ ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తారో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.