పాజిటివ్ పోస్టుతో మేనల్లుడికి అండగా నిలిచిన మెగాస్టార్..??

Update: 2020-12-23 14:19 GMT
మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా ఈ నెల 25న అంటే క్రిస్మస్ రోజున థియేట్రికల్ రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమా పై సోషల్ మీడియాలో బజ్ బాగానే క్రియేట్ అయింది. ఈ ఏడాది మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ సోలో సినిమా.. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడింది. లాక్ డౌన్ ముందు నుండి సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్ ఇలా అన్ని విధాలుగా సోలో టీం ప్రమోట్ చేసుకుంటూ వస్తూనే ఉంది. ప్రస్తుతం మెగా హీరో సాయిధరమ్ తేజ్, ఈ సినిమా హీరోయిన్ నభానటేష్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేస్తున్నారు. అంతేగాక తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ ఇంటర్వ్యూ లాంటి ప్రోగ్రాం కూడా విడుదల చేశారు.

అయితే ఇన్ని విధాలుగా ప్రమోట్ చేస్తున్నా.. ఈ సినిమా కరోనా బ్రేక్ తర్వాత వస్తున్న ఫస్ట్ మీడియం బడ్జెట్ మూవీ కావడంతో మిగతా మేకర్స్, ఇండస్ట్రీ నిర్మాతలు, హీరోలు అంతా కూడా ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే థియేటర్ లోకి వస్తున్న ఫస్ట్ బిగ్ ఫిల్మ్ ఇదే. అయితే ఇలాంటి టెన్షన్ తరుణంలో మెగాస్టార్ చిరు తన మేనల్లుడు సాయితేజ్ కి ట్విట్టర్ వేదికగా ధైర్యం చెప్పారు. అంతేగాక కరోనా నియమాలు కూడా పాటించాలని ప్రేక్షకులకు సూచించారు. ''క్రిస్మస్ కి విడుదల అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్ టీంకి శుభాకాంక్షలు. లాక్ డౌన్ తర్వాత విడుదల అవుతున్న ఫస్ట్ సినిమా కాబట్టి ఇది ఇండస్ట్రీకి ఒక ముఖ్యమైన సందర్భం. ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం ఇండస్ట్రీకే స్ఫూర్తిని ఇస్తుందని.. అలాగే ప్రేక్షకులు కూడా మాస్కులు ధరించి డిస్టెన్స్ పాటిస్తూ సినిమా ఎంజాయ్ చేయాలని" మెగాస్టార్ సూచించారు. ఈ పోస్ట్ తో మెగా మేనల్లుడికి మెగాస్టార్ అండగా నిలవడం విశేషమని ఇండస్ట్రీ టాక్.
Tags:    

Similar News