కరోనా ఎఫెక్ట్ : భయం - నిర్లక్ష్యం రెండూ వద్దని సూచించిన మెగాస్టార్
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని తమ అభిమానులకు సూచిస్తున్నారు. తమ వంతు సామాజిక బాధ్యతగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సామాజిక అంశాలపై స్పందించడానికి ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాలసిన జాగ్రత్తలు చెబుతూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం, అతి భయం రెండూ పనికిరావని, తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోన్న సమస్య కరోనా అని, అయితే మనకి ఏదో అయిపోతుందన్న భయం కానీ, ఏమీ కాదన్న నిర్లక్ష్యం కానీ పనికిరావని తెలిపారు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయమిదని, ఈ ఉద్ధృతి తగ్గేవరకు జన సమూహానికి వీలైనంత దూరంగా ఉండాలని, ఇంటి వద్దే ఉండడం ఉత్తమమని సూచించారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రతలు కూడా తెలియజేసారు.
తుమ్మినా, దగ్గినా కర్చిఫ్ లాంటివి అడ్డు పెట్టుకోవడం తప్పనిసరని, ఆ వాడిన టిష్యూపేపర్ కూడా చెత్త బుట్టలో వేయాలని సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని, కరోనా కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉందని, వీలైనంత వరకు ఎవరికీ కరచాలనం చేయకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం అని చిరంజీవి పిలుపునిచ్చారు. తమ అభిమాన హీరో సామాజిక బాధ్యతను అభిమానులు మెచ్చుకుంటున్నారు. అందరు హీరోలు ఇలాగే అవేర్నెస్ వీడియోస్ పోస్ట్ చేస్తే కొంత మేరకైనా కరోనా నివారణ చర్యలు తీసుకుంటారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Full View Full View Full View Full View Full View