• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు152: అరవింద్ గారికి...

చిరు152: అరవింద్ గారికి ఇచ్చిన మాట తప్పినట్టేనా?

By - Tupaki Desk
Update: 2019-10-15 09:26 GMT
గీతా ఆర్ట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తే అది సూపర్ హిట్ అని ముందే డిసైడ్ అయిపోవాలి.  ఎందుకంటే ఆ కాంబినేషన్ ట్రాక్ రికార్డ్ అలాంటిది.  చిరంజీవి- అరవింద్ బంధం కూడా అలాంటిదే.  అరవింద్ గారు ఏ సినిమా చేసినా దాదాపుగా సక్సెస్ గ్యారెంటీ అన్నట్టుగా ఉంటుంది.. మెగాస్టార్ తో సినిమా అంటే ఆయన దాన్ని ఇంకా సీరియస్ గా తీసుకుంటారు.  అయితే ఎందుకో మెగాస్టార్ మాత్రం తన రీఎంట్రీ తర్వాత అల్లు అరవింద్ గారికి సినిమాను నిర్మించే అవకాశం ఇవ్వడం లేదు.  ఇదో హాట్ టాపిక్ గా మారింది.

చిరు రీ-ఎంట్రీ సినిమా 'ఖైది నెం.150' ను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు.  అప్పట్లోనే నెక్స్ట్ సినిమాను కూడా తనే నిర్మిస్తానని చరణ్ చెప్పారు.  అయితే తర్వాత చేయబోయే సినిమా #చిరు152 గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఉంటుందని అన్నారు. జస్ట్ గాసిప్ లాగా కాకుండా అ సినిమా గురించి వేదికపైనే ప్రకటించారు. ఇక ఆ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని కూడా స్పెక్యులేషన్స్ ప్రచారంలోకి వచ్చాయి.  రీసెంట్ గా #చిరు152 లాంచ్ అయింది.  ఈ సినిమాకు దిల్ రాజు కాంపౌండ్ సంబంధీకులు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాతలు.  చరణ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో భాగస్వాములు.  ఎక్కడా గీతా ఆర్ట్స్ పేరు వినిపించడం లేదు.

చరణ్ వరసగా మెగాస్టార్ తో రెండు సినిమాలు నిర్మించారు కాబట్టి ఈ సినిమా ప్రొడక్షన్ లో గీతా ఆర్ట్స్ వారిని ఇన్వాల్వ్ చేయవచ్చని.. కాకపోతే చరణ్ మాత్రం తనే స్వయంగా పార్టనర్ గా మారడంతో అల్లు అరవింద్ గారు దూరంగా ఉండిపోయారని అంటున్నారు. ఇక్కడే ఏదో తేడా కొట్టిందని ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. చరణ్ ఆలోచనలలో మార్పుల కారణంగానే గీతావారు దూరంగా ఉండాల్సి వస్తోందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ లో 152వ చేస్తానని చెప్పిన మాటను మెగాస్టార్ తప్పారనే మాట కూడా వినిపిస్తోంది.
Tags:    
  • Chiru 
  • Aravind 
  • 152 
  • Geetha Arts 
  • Konidela Production 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS