మెగా అల్లుడితో కామెడీలు చేయిస్తాడా?

Update: 2020-02-06 04:37 GMT
ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులు గా రాణిస్తున్న ట్రెండ్ కి ఏనాడో శ్రీ‌కారం చుట్టారు. త్రివిక్ర‌మ్- కొర‌టాల శివ వంటి టాప్ రైట‌ర్స్ నేడు ఎదురే లేని ద‌ర్శ‌కులుగా ప‌రిశ్ర‌మ‌ను శాసిస్తున్నారు. సున్నిత‌మైన కుటుంబ ఉద్వేగాల్ని ట‌చ్ చేస్తూ ప్రేమ‌క‌థ‌ల్ని .. ఫ్యాక్ష‌న్ యాక్ష‌న్ ని తెర‌పై అద్భుతంగా చూపించిన ఘ‌న‌త ఈ ఇద్ద‌రికీ ద‌క్కుతుంది. పంచ్ రైటింగ్ .. సెటైర్ రైటింగ్.. కామెడీ టైమింగ్ తెలిసిన ద‌ర్శ‌క‌ ర‌చ‌యిత‌లుగా వీరు తెర‌కెక్కించే సినిమాల‌కు ఆడియెన్ లో క్రేజు ఉంది. ఆ ఇద్ద‌రి త‌ర‌హాలో ఎంద‌రో వ‌చ్చినా ఆశించినంత రాణించ‌లేక‌పోయిన మాట వాస్త‌వం. వ‌క్కంతం లాంటి టాప్ రైట‌ర్ ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. ర‌చ‌యిత‌ డైమండ్ ర‌త్న‌బాబు బుర్ర‌క‌థ సినిమాతో అదృష్టం ప‌రీక్షించుకున్నా ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు.

తాజాగా ర‌చ‌యిత‌లు టాప్ డైరెక్ట‌ర్స్ గా ఎదిగిన వారి స్ఫూర్తితో తాను కూడా ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నారు ర‌చ‌యిత శ్రీ‌ధ‌ర్ సీపాన‌. మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా అత‌డు ఓ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మార్చి లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. వెంకీ మామ నిర్మాత విశ్వ‌ ప్ర‌సాద్ జీఏ2 పిక్చ‌ర్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ‌ధ‌ర్ మంచి మ‌ట‌కారి. మాట‌ల ర‌చ‌యిత‌గా అద్భుత‌మైన కామెడీ టైమింగ్ తెలిసిన వాడు కావ‌డంతో అత‌డు కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ స్క్రిప్టు తో ల‌క్ చెక్ చేసుకోనున్నారు. ల‌వ్ .. కామెడీ.. ఎమోష‌న్స్ ప్ర‌ధానంగా సాగే సినిమాని తెర‌కెక్కించనున్నారు. వాస్త‌వానికి శ్రీ‌ధ‌ర్ ద‌ర్శ‌కుడిగా ఇంత‌కుముందు ఒక సినిమా మొదలైనా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అది టేకాఫ్ అవ్వ‌లేదు. ఈసారి ప‌క‌డ్భందీగానే ప్రాణాళికాబ‌ద్ధంగా ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌.

మాట‌ల ర‌చ‌యిత శ్రీ‌ధర్ సీపాన కామెడీ డైలాగ్ రైట‌ర్. కొన్ని క‌థ‌ల్ని రాసారు. గ‌తంలో అల్ల‌రి న‌రేష్ సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేశారు. విక్టరీ వెంకటేష్ నమో వెంకటేశ- మహేష్ దూకుడు చిత్రాలకు రచనా సహకారం అందించారు. అహ నా పెళ్ళంట- పూలరంగడు- భీమవరం బుల్లోడు- లౌక్యం- సౌఖ్యం- డిక్టేటర్ వంటి చిత్రాలకు కథ- మాటలు అందించారు. ద‌ర్శ‌కుడిగా తొలి ప్ర‌య‌త్నం లో మెగా కాంపౌండ్ గౌర‌వాన్ని కాపాడుతాన‌ని శ్రీ‌ధ‌ర్ ఈ సంద‌ర్భంగా ప్రామిస్ చేస్తున్నాడు. ఇక క‌ళ్యాణ్ దేవ్ న‌టించిన విజేత‌ ఫ్లాపైన నేప‌థ్యంలో శ్రీ‌ధ‌ర్ ఎంతో కేర్ ఫుల్ గా తాజా చిత్రాన్ని మ‌లిచే ప‌ట్టుద‌ల‌ తో ఉన్నార‌ట‌.




Tags:    

Similar News