ఆ ఇద్ద‌రికి ఆ విష‌యంలో చిరంజీవి స్ఫూర్తి

Update: 2020-08-10 15:30 GMT
స్నేహ సంబంధాల్ని కొన‌సాగించ‌‌డంలో మెగాస్టార్ చిరంజీవి త‌ర్వాత‌నే. ఆయ‌న కెరీర్ ఆద్యంతం ఇది క‌నిపిస్తుంది. త‌న కెరీర్ ఆరంభం నుంచి సొంత బ్యాన‌ర్లు ఉన్నా.. కె.ఎస్.రామారావు.. డీవీవీ దాన‌య్య వంటి స్నేహితుల‌‌‌తో సినిమాలు చేశారు. ఆ స్నేహాన్ని ఇప్ప‌టికీ కొన‌సాగిస్తూ సినిమాలు చేస్తూనే ఉన్నారు. వ‌రుస‌గా అవ‌కాశాలిచ్చి త‌న కాంపౌండ్ నిర్మాత‌లుగా వారికి ఆశ్ర‌యమిచ్చారు చిరు. ఇక ఆయ‌న‌తో పోలిస్తే ఇత‌ర అగ్ర హీరోల స్టైల్ వేరేగా ఉంటుంది. నాగార్జున‌.. వెంకీ.. బాల‌య్య లాంటి వాళ్లు చాలా ఫ్లెక్సిబుల్ గా అంత‌గా తెలియ‌ని ఫేస్ ల‌కు అవ‌కాశాలిచ్చిన సంద‌ర్భాలున్నాయి. ఇండ‌స్ట్రీ స్నేహితుల‌తో సినిమాలు చేసినా ఇత‌రుల‌కు ఎక్కువ‌గానే అవ‌కాశాలిచ్చారు.

ఇటీవ‌ల ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు త‌మ స్నేహితుల‌నే నిర్మాత‌లుగా ప్ర‌మోట్ చేయ‌డం చూస్తుంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. తొలి నుంచి త‌మ‌తో సౌక‌ర్యంగా క‌లిసిపోయిన మిత్రుల‌ను నిర్మాత‌లుగా ప్ర‌మోట్ చేస్తూ వారితో నిర్మాణ భాగ‌స్వాములుగా కొన‌సాగ‌డం న‌యా ట్రెండ్ గా మారింది. త్రివిక్ర‌మ్.. కొర‌టాల వంటి స్టార్ డైరెక్ట‌ర్లు ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు.

త్రివిక్ర‌మ్ తొలి నుంచి హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తో అనుబంధం కొన‌సాగిస్తున్నారు. ఆ బ్యాన‌ర్ సినిమాల కోసం ఇత‌రుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు సైతం తిరిగి వెన‌క్కి ఇచ్చేశార‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే కొరటాల శివ సైతం త‌న స్నేహితుడు మిక్కిలినేనిని నిర్మాత‌గా ప్ర‌మోట్ చేస్తున్నారు. బ‌న్ని లాంటి స్టార్ హీరోతో ఆయ‌న్ని లాంచ్ చేస్తున్నారు. ఇక‌పై వ‌రుస‌గా మిక్కిలినేని సుధాక‌ర్ తోనే సినిమాలు చేస్తార‌ట‌. ఆ ఇద్దరు డైరెక్ట‌ర్లు ఏం చేసినా కానీ స్నేహితుల‌ను ఇండ‌స్ట్రీ లో నిల‌బెట్ట‌డ‌మే ధ్యేయంగా క‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడు పొర‌పొచ్చాలు వ‌చ్చినా స్నేహితుల‌తో అయితే చిక్కు ముడులు విప్ప‌డం క‌ష్ట‌మేమీ కాదు.  అదే బ‌య‌టివారితో అయితే ఆ వెసులుబాటు ఉండ‌క‌పోవ‌చ్చు. సౌక‌ర్యం దాంతో పాటే వెసులుబాటు అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే ఇలా చేస్తున్నార‌ని భావించ‌వ‌చ్చా!!
Tags:    

Similar News