ముఖ్యమంత్రికి చిరంజీవి ధన్యవాదాలు మీ మద్దతు గొప్పదంటూ హర్షం

Update: 2021-04-06 16:39 GMT
చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రాయితీలు ప్ర‌క‌టించారు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్. క‌రోనా లాక్ డౌన్ కాలంలో థియేట‌ర్లు చాలా కాలం మూత‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత తెరుచుకున్న‌ప్ప‌టికీ.. చాలా రోజుల వ‌ర‌క ప్రేక్ష‌కులు పూర్తిస్థాయిలో సినిమాల‌కు వెళ్ల‌లేదు. ఇప్పుడు.. సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో మ‌ళ్లీ పాత ప‌రిస్థితే పున‌రావృతం అయ్యేలా క‌నిపిస్తోందనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. థియేట‌ర్ల‌కు రాయితీలు ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి. 2020 ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో థియేట‌ర్లు చెల్లించాల్సిన ఫిక్స్ ఛార్జీల బ‌కాయిల‌ను 2021 జులై నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కు చెల్లించేలా అవ‌కాశం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

అంతేకాకుండా.. బ్యాంకుల నుంచి  తీసుకున్న రుణాల్లో 50 శాతం వ‌ర‌కు వ‌డ్డీ రేటు త‌గ్గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై మెగాస్టార్ చిరంజీవి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.''క‌రోనా కాలంలో సినీ ఇండ‌స్ట్రీకి ఉప‌శ‌మ‌నం క‌లిగిలించేలా మీరు తీసుకున్న నిర్ణ‌యం గొప్ప‌ది. మీ మ‌ద్ద‌తు ఇండ‌స్ట్రీపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్న వేలాది మంది కార్మికుల‌కు కుటుంబాల‌కు స‌హాయ ప‌డుతుంది'' అని ట్వీట్ చేశారు చిరంజీవి.
Tags:    

Similar News