• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరా సంక్రాంతికి రాదు

సైరా సంక్రాంతికి రాదు

By - Tupaki Desk
Update: 2018-06-03 07:37 GMT
‘ఖైదీ నంబర్ 150’తో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సాఫీగా సాగిపోయింది. పునరాగమనానికి ఒక రీమేక్ మూవీని ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడిన చిరంజీవి.. ఆ తర్వాత మాత్రం పెద్ద రిస్కే చేయడానికి రెడీ అయ్యాడు. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ‘సైరా నరసింహారెడ్డి’కి శ్రీకారం చుట్టాడు. ఎన్నో ఏళ్లుగా నానుతున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు గత ఏడాది పట్టాలెక్కింది. ఐతే అనుకున్న ప్రకారం ఈ చిత్ర షూటింగ్ సాగలేదు. వివిధ కారణాల వల్ల షెడ్యూళ్లు ఆలస్యమయ్యాయి. అలాగని చిత్ర బృందమేమీ హడావుడి పడటం లేదు. రాజీ పడటం లేదు. చిరు కెరీర్‌ కే తలమానికంగా ఈ ప్రాజెక్టును నిలబెట్టాలన్న లక్ష్యంతో హడావుడి లేకుండా షూటింగ్ కానిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేయాలని ముందు అనుకున్నప్పటికీ.. ఆ డేట్ అందుకోవడం కష్టమే అని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సంక్రాంతికే అని ఫిక్సయితే క్వాలిటీ తేడా వచ్చేయొచ్చని భావించి సినిమాను వేసవికి వాయిదా వేయాలని డిసైడయ్యారన్నది తాజా సమాచారం. ఈ ఏడాది సంక్రాంతి నుంచి వాయిదా పడి వేసవిలో రిలీజై ‘రంగస్థలం’ సంచలన విజయాన్నందుకున్న నేపథ్యంలో ‘సైరా నరసింహారెడ్డి’కి కూడా ఇదే సెంటిమెంటు ఫాలో అవుతున్నారట. ‘రంగస్థలం’ తరహాలోనే వేసవికి తొలి భారీ సినిమాగా దీన్నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ ఏడాది చివరికి ‘సైరా’ షూటింగ్ పూర్తవుతుందని.. పోస్ట్ ప్రొడక్షన్ నెమ్మదిగా చేసుకుని వేసవిలో సినిమాను రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తోంది. అమితాబ్ బచ్చన్.. జగపతిబాబు.. విజయ్ సేతుపతి.. సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణే ఈ చిత్ర నిర్మాత.

Tags:    
  • chiranjeevi 
  • Sye Raa Movie 
  • Summer 

Similar News

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS