మెగాస్టార్ మెడకు పెద్ద కట్టు ఏంటంటే..

Update: 2016-02-08 10:08 GMT
మెగాస్టార్ చిరంజీవి అనారోగ్యం కారణంగా సర్జరీ చేయించుకున్నారని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ముంబైలో ఆపరేషన్ చేయించుకున్నారని కూడా గతంలోనే సమాచారం ఇచ్చాం. ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో భుజానికి సర్జరీ చేయించుకున్నా.. ఆ విషయంపై అధికారికంగా మాత్రం ఎవరూ నోరు విప్పలేదు. కానీ ఇప్పుడు రాజమండ్రిలో చిరును చూసిన వాళ్లకు అసలు విషయం అర్ధమైంది.

కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షలో ఉన్న సమయంలో.. ఆయన్ని పలకరించేందుకు కాంగ్రెస్ లీడర్ గా, కాపు నాయకుడిగా చిరంజీవి ఆయన దగ్గరకు వెళ్లాలని భావించారు. ఇందుకోసం హైద్రాబాద్ టు రాజమండ్రికి ఫ్లైట్ లో వెళ్లారు. అక్కడ మిగతా కాంగ్రెస్ లీడర్లతో పాటు చిరును కూడా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే మెగాస్టార్ భుజానికి కట్టుతో కనిపించారు. ఆపరేషన్ తర్వాత 15 రోజుల పాటు చేతిపై భారం పడకూడదని ఖచ్చితంగా షోల్డర్ ప్యాక్ ఉండాలని డాక్టర్లు సూచించడంతోనే.. ఇలా కట్టుతోనే బైటకు రావాల్సి వచ్చింది.

తమ అభిమాన హీరోని ఇలా బ్యాండేజ్ లతో చూసిన మెగాభిమానులు చాలా వర్రీ అయిపోతున్నారు. అయితే ఎటువంటి ఆందోళన అవసరం లేదని, కేవలం భుజంపై భారం పడకుండానే ఈ ఏర్పాటు అంటున్నారు మెగా సన్నిహితులు. ఈ గాయం నుంచి కోలుకోగానే.. మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమా కత్తి రీమేక్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇన్నాళ్లూ కూడా ఈ సర్జరీ కోసమే షూటింగ్ ని ప్రారంభించలేదని తెలుస్తోంది.
Tags:    

Similar News