బిబి4: ఆ ముగ్గురిపై మెగా వరాల జల్లు

Update: 2020-12-21 03:45 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఫినాలే ఎపిసోడ్ కు స్పెషల్‌ గెస్ట్‌ గా వచ్చిన చిరంజీవి సందడి చేశారు. తనదైన టైమింగ్‌ తో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేశారు. తనశైలి మ్యానరిజంతో మెస్మరైజ్‌ చేశారు అనడంలో సందేహం లేదు. ఒక్కో కంటెస్టెంట్ గురించి చిరంజీవి సరదాగా మాట్లాడిన తీరు నిజంగా అభినందనీయం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటీ అంటే చిరంజీవి ఫినాలే ఎపిసోడ్‌ లో సోహెల్‌.. మెహబూబ్‌ మరియు దివిలపై వరాల జల్లు కురిపించారు. దివికి తాను చేయబోతున్న 'వేదాళం' రీమేక్ లో ఒక ముఖ్య పాత్ర ఇవ్వమని మెహర్ రమేష్ కు చెప్పాను. ఆయన ఒక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంది. ఆమెకు ఇద్దాం అన్నాడు. ఆ తర్వాత ఆమెకు మరిన్ని మంచి పాత్రలు వస్తాయని చిరంజీవి పేర్కొన్నాడు.

హీరోయిన్‌ అవ్వాలని కలలు కంటున్న దివికి మెగాస్టార్‌ మూవీలో ఛాన్స్‌ అంటే ఇక ఆమె కెరీర్ సెట్‌ అయినట్లే అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెహబూబ్ కు తనకు వచ్చిన దాంట్లోంచి అయిదు లక్షలు సోహెల్‌ ఇస్తానంటూ చెప్పండంతో నీకు వచ్చిన దాంట్లోంచి ఇవ్వడం ఏంటీ నేను నీ తరపున మెహబూబ్‌ కు పది లక్షలు ఇస్తానంటూ స్టేజ్‌ పైనే చిరంజీవి చెక్‌ రాసి ఇచ్చారు. అలాగే చిరంజీవి మెహబూబ్ గురించి మాట్లాడుతూ హౌస్‌ లో ఉన్న వారందరి కంటే బెస్ట్‌ డాన్సర్‌ అంటూ కితాబిచ్చారు. మెహబూబ్ ఎనర్జికి ఫిదా అంటూ చిరు పేర్కొన్నారు.

ఇక సోహెల్‌ కు ఊహించని గిఫ్ట్ ను చిరంజీవి అందించారు. మొదటగా మెహబూబ్‌ కు ఇస్తానన్న 5 లక్షలు నీ దగ్గరే ఉంచుకోమన్నారు. ఆ తర్వాత నీవు మటన్‌ కోసం అంతగా తాపత్రయ పడుతుంటే మా ఇంట్లో వారు నీకు మటన్ బిర్యానీ పంపించారు. సురేఖ స్వయంగా చేసిన మటన్ బిర్యానీ, అది కూడా అలాల్‌ చేసిన మటన్ బిర్యానీ నీ కోసం తీసుకు వచ్చాను. నీవు తిని మీ వాళ్లకు కూడా తినిపించవచ్చు అన్నారు. నేను ఒక మంచి సినిమాను చేస్తాను సర్‌ మీరు నాకు మద్దతుగా నిలవాలని అన్నారు. ఆసమయంలో చిరంజీవి స్పందిస్తూ నాకు చిన్న రోల్‌ ఇవ్వు నేను చేస్తాను. సినిమా ప్రమోషన్‌ కోసం వస్తామని చిరంజీవి మరియు నాగార్జున హామీ ఇచ్చారు. మొత్తానికి ఆ ముగ్గురికి చిరంజీవి వరాల జల్లు కురిపించారు.
Tags:    

Similar News