అంతా స్క్రిప్ట్‌ ప్రకారమే.. చిరు నాగ్‌ లు ఇచ్చిన రూ.20 లక్షలు బిబి టీం నుండే!!

Update: 2020-12-23 03:58 GMT
బిగ్‌ బాస్ సీజన్‌ 4 మొత్తం కూడా అప్‌ అండ్ డౌన్‌ అన్నట్లుగా సాగింది. మొదటి రోజు ఎపిసోడ్‌ రికార్డు స్థాయి రేటింగ్ ను దక్కించుకోగా తదుపరి వారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ కు దారుణంగా రేటింగ్ పడిపోయింది. నిర్వాహకులు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా రేటింగ్ రాలేదు. కనీసం ఫినాలే ఎపిసోడ్‌ ను అయినా రసవత్తరంగా మార్చాలనే ఉద్దేశ్యంతో చాలా పెద్ద స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు. ఏకంగా అయిదు గంటల పాటు మారథాన్ ఎపిసోడ్‌ ను నిర్వాహకులు కంటిన్యూ చేశారు. సాదారనంగా అయితే చివరి రోజే షూటింగ్ చేయాలి. కాని అయిదు రోజులు కాబట్టి హారిక అరియానాలను ముందు రోజే బయటకు తీసుకు వచ్చేశారు. ఇక బిగ్‌ బాస్‌ చివరి రోజు కంటెస్టెంట్స్ తో టీం పర్సనల్‌ గా మాట్లాడారేమో అనిపిస్తుంది. వారికి ఫినాలే ఎపిసోడ్‌ సందర్బంగా ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనే విషయమై చెప్పే ఉంటారని అంటున్నారు.

ఇక టాప్‌ 3 లో ఉన్న సోహెల్‌ విజేత అవ్వాలనే ఆశ లేదని చెప్పి 25 లక్షలు తీసుకుని బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో 10 లక్షలు ఆశ్రమంకు ఇచ్చేందుకు ఓకే చెప్పడం.. ఆ మొత్తంను నాగార్జున ఇచ్చేందుకు సిద్దం అవ్వడం.. మళ్లీ సోహెల్‌ మెహబూబ్ కు ఇస్తానంటూ చెప్పడం ఆ డబ్బును మెహబూబ్ కు తాను ఇస్తానంటూ చిరంజీవి చెక్‌ రాసి ఇవ్వడం అంతా కూడా ప్రేక్షకుల్లో అద్బుతమైన ఉత్సాహంను కలిగించి షో ను వదిలి పెట్టకుండా టీవీలకు అతుక్కు పోయేలా చేసింది.

నాగార్జున మరియు చిరంజీవిలు ఇచ్చిన 20 లక్షల రూపాయలు షో రేటింగ్ ను అమాంతం పెంచాయి అనడంలో సందేహం లేదు. వారిద్దరు అప్పటికప్పుడు ఆలోచించి 10 లక్షల చొప్పున ఇచ్చి ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు. కాని కొందరు మాత్రం అదంతా కూడా స్క్రిప్ట్‌ అయ్యి ఉంటుందని.. అప్పటికి అప్పుడు షో నిర్వాహకులు వారిద్దరితో ఆ డబ్బును ఇప్పించి ఉంటారు లేదా ముందు గానే ప్లాన్‌ చేసి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు హీరోలు ఇచ్చిన రూ.20 లక్షల రూపాయలు మాత్రం ఖచ్చితంగా షో నిర్మాత అయిన ఎండమోల్‌ షైన్‌ సంస్థకు చెందిన ఖాతా నుండి వెళ్లి ఉంటాయని అంటున్నారు. రేటింగ్ పెంచడం కోసం స్క్రిప్ట్‌ ప్రకారం అది చేశారు. అనుకున్నట్లుగానే రేటింగ్‌ భారీగానే వచ్చింది. యాడ్స్ ద్వారా భారీ మొత్తంను దక్కించుకున్నారు. కనుక నిర్మాతలు ఆ 20 లక్షల రూపాయలను ఇస్తారనేది టాక్‌. ఇక నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తాను అంటూ హామీ ఇచ్చాడు. అందుకు కావాల్సిన డబ్బును కూడా బిబి నిర్మాతలే ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ ఇద్దరు స్టార్స్ కూడా కేవలం స్క్రిప్ట్‌ ప్రకారం నడుచుకుని ఉంటారు అనేది చాలా మంది వాదన. అసలు విషయం ఏంటీ అనేది ఆ షో నిర్వాహకులకే తెలియాలి.
Tags:    

Similar News