ఎన్టీఆర్ సవాలును స్వీకరించిన మెగాస్టార్...!
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా సెలెబ్రెటీలు అందరూ ఇంటి పట్టునే ఉండి కాలక్షేపం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. కొందరు ఇంట్లో జిమ్ వర్క్ ఔట్స్ చేస్తూ ఫిట్ నెస్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు ఇంట్లో వంట పని - ఇంటి పని చేస్తూ ఇంట్లో ఆడవారికి తోడుగా ఉంటున్నారు. అంతేకాదు ఈ కష్టకాలంలో ఇంట్లో పని మనుషులు లేకపోవడంతో ఇంట్లో ఆడవారికి పనుల్లో తోడుగా ఉంటూ సాయం చేసినోడే అసలైన మనిషంటూ 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి 'బీ ది రియల్ మ్యాన్' అనే ఛాలెంజ్ కి శ్రీకారం చుట్టాడు. దీనిలో భాగంగా దర్శకదీరుడు రాజమౌళికి ఈ ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే.
దీంతో రాజమౌళి ఇల్లు శుభ్రం చేస్తూ.. గిన్నెలు తూడ్చూతూ ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆయన ఎన్టీఆర్ - చరణ్ లకు #BeTheRealMan ఛాలెంజ్ విసిరాడు. దీంతో రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించిన తారక్.. తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా 'మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం' అంటూ పోస్ట్ చేస్తూ వీడియోలో ఆయన ఇంటి ఆవరణను శుభ్రం చేయడం.. గిన్నెలు కడగడం.. ఇల్లు తుడవడం లాంటివి చేస్తున్నాడు. అంతేకాదు ఆయన ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ సీనియర్లైన చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలయ్యల తో పాటు దర్శకుడు కొరటాల శివను ఛాలెంజ్ చేశాడు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా జూనియర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. 'ఛాలెంజ్ యాక్సిప్టెడ్ తారక్.. అలాగే యువర్ పార్టనర్ చరణ్ ఇన్ క్రైమ్.. వీడియో కోసం వెయిటింగ్' అంటూ పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా దీనికి చిరంజీవి నటించిన 'ఛాలెంజ్' సినిమా టైటిల్ పోస్టర్ ని జత చేసాడు. ఈ పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఇంట్లో పనులు చేసుకుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరి ఎలాంటి ఇంటి పనులతో వీడియో వదులుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు మిగిలిన సీనియర్ హీరోలు ఈ ఛాలెంజ్ పై ఎలా స్పందిస్తారో అని ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు.