అల్లు వారి అల్లుడిగా 37 ఏళ్లు

Update: 2017-02-20 13:02 GMT
చిరంజీవి.. ఈ పేరే ఇప్పుడు ఓ ప్రభంజనం. మెగాస్టార్ అంటే చాలు.. పూనకాలు తెచ్చేసుకునే అభిమానులు చాలామందే ఉంటారు. ఇదంతా ఆయన మెగాస్టార్ గా ఎదిగిన తర్వాత జరిగిన విషయం. ఆయన సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు. మంచి మనిషిగా గుర్తింపు సంపాదించుకున్నారు.

చిరంజీవి వ్యక్తిత్వం బాగా నచ్చిన సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య.. తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేయాలని భావించడం.. పెళ్లి జరిగిపోవడం అయిపోయాయి. ఇదంతా జరిగి ఇవాల్టితే 37 ఏళ్లు పూర్తయింది. 1980 ఫిబ్రవరి 20వ తేదీన అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో ఆయన వివాహం జరిగింది. వివాహ మహోత్సవం పూర్తి చేసుకుని 37 ఏళ్లు పూర్తి కావడంతో.. అప్పటి శుభలేఖ ఇప్పుడు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.

1980 ఫిబ్రవరి 20న ఉదయం 10.50కి మద్రాస్ లో చిరు పెళ్లి జరగగా.. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ నిర్వహించారు. ఈ శుభలేఖతో పాటు ఆనాటి పెళ్లి ఫోటోలు కూడా ఇప్పుడు నెట్ లో చక్కర్లు కొట్టేస్తున్నాయి. 24 ఏళ్ల వయసులో చిరుని పెళ్లి కొడుకుగా ఎలా ఉన్నారో చూసుకుని తెగ మురిసిపోతున్నారు మెగాభిమానులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News