• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ ను అభినందించిన...

పవన్‌ ను అభినందించిన వివాదాస్పద గాయిని

By - Tupaki Desk
Update: 2020-11-19 02:30 GMT
సౌత్‌ ఇండియాలో మీటూ ఉద్యమంకు ఊతం ఇచ్చేలా కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రముఖులపై విమర్శలు చేసిన సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద. ఈమె రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద కామెంట్‌ చేయడం లేదా ఎవరినో ఒకరిని విమర్శించడం చేస్తూనే ఉంటుంది. ఎక్కడ ఆడవారికి సంబంధించి అన్యాయం జరిగినా కూడా తనవంతుగా సోషల్‌ మీడియా ద్వారా స్పందించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఒక సినిమా గురించి మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది.

బాలీవుడ్‌ లో సక్సెస్‌ అయిన పింక్‌ సినిమాను తమిళంలో అజిత్‌ హీరోగా నేర్కొండ పార్వాయి అనే టైటిల్‌ తో రీమేక్‌ అయ్యింది. ఆడవారిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఇన్నాళ్లు ఇదొక యాక్షన్‌ సినిమా అనుకుని నేను చూడలేదు. కాస్త ఆలస్యంగా ఈ సినిమాను చూసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి సినిమాలు రావడం చాలా ఆనందకర విషయం.

ఇదే సినిమాను తెలుగులో స్టార్‌ హీరో అయిన పవన్‌ కళ్యాణ్‌ వంటి వారు చేయడం నిజంగా అభినందనీయం అంటూ పేర్కొంది. ఇలాంటి సున్నితమైన అంశాలపై స్టార్‌ హీరోలు ఆసక్తి చూపించి నటించడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం అంటూ పేర్కొంది. స్టార్స్‌ ఇలాంటి సినిమాల్లో నటించడం వల్ల చెప్పాలనుకున్న మెసేజ్‌ చాలా మందికి చేరుతుంది. తద్వారా మంచి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
Tags:    
  • Chinmayi Sripada 
  • Pawan Kalyan 
  • Vakeel Saab 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS