సమంతా ఆత్మతో మన్మథుడికి చిక్కొచ్చిపడిందే!

Update: 2019-07-10 05:57 GMT
అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్  దర్శకత్వంలో 'మన్మథుడు 2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా రొమాంటిక్ ఫ్లేవర్లో తెరకెక్కుతుండడంతో ఈ జెనరేషన్ కు కనెక్ట్ అయ్యేలాగే ఉంది.  ప్రోమోస్ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి.  నాగ్ లాంటి  సీనియర్ స్టార్ ఇలాంటి రొమాంటిక్ జోనర్ లో సినిమా చేయడం ఒక డిఫరెంట్ అటెంప్ట్. అయితే ఈ సినిమాకు అనుకోని కోణం నుంచి నెగెటివిటీ వచ్చిపడుతోంది.   ఆ కోణమే.. సింగర్ కం డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి.

ఒకరికి పర్సనల్ సమస్యలు.. అభిప్రాయలు ఎన్నైనా ఉండొచ్చు కానీ వాటిని రోజూ చెప్తూ.. కొందరిని టార్గెట్ చేస్తూ.. ప్రపంచంలో ఉండే అన్ని సమస్యల మీద గళమెత్తుతూ ఉంటే ఒక దశకు వచ్చేసరికి వారి మీద  జనాల్లో  నెగెటివిటీ ఏర్పడుతుంది.   బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కావచ్చు.. చిన్మయి కావచ్చు ఎవరైనా దీనికి ఎక్సెప్షన్ కాదు.  ప్రతిదానికి ఊరికే నోరేసుకుని అవతల వాళ్ళ మీద పడిపోతే అప్పటికి చెల్లుతుందేమో కానీ నెటిజన్లు చూస్తూ ఊరుకోరు. ఎక్కడైనా నెటిజన్లకు చిన్న అవకాశం దొరికితే ట్రోలింగ్ మొదలు పెడతారు.  చిన్మయి విషయంలో 'మన్మథుడు 2' రూపంలో ఆమెను ట్రోల్ చేసే వారికి మంచి అవకాశం దొరికింది. 

చిన్మయి 'మన్మథుడు 2' గురించి మాట్లాడితే ఒక సమస్య.. మాట్లాడక పోతే మరో సమస్య.  తన హబ్బీ రాహుల్ రవీంద్రన్ సినిమా కదా అనే ఉద్దేశంతో మాట్లాడితే ఈ సినిమాలో సీన్స్ ను ఎప్పుడో చిన్మయి వెలిబుచ్చిన అభిప్రాయాలతో లంకె పెట్టి మరీ రఫ్ఫాడుకుంటున్నారు.  ఒక వేళ 'మన్మథుడు 2' గురించి మాట్లాడకపోతే ఊర్లో ఉండే అన్ని సమస్యల గురించి మాట్లాడతావు... కానీ ఈ సినిమాలో లిప్పు లాకులు... హీరో హీరోయిన్ ల వయసు తేడా లాంటి సమస్యలపై ఎందుకు మాట్లాడవు అని తగులుకుంటున్నారు.

చిన్మయి రచ్చ కనుక లేకపోతే  'మన్మథుడు 2' పట్ల జనాల్లో పాజిటివ్ ఫీలింగ్ ఉండేదని నాగ్ కూడా అభిప్రాయపడుతున్నారని గుసగుసలు ఉన్నాయి.  బిగ్ బాస్ 2 కు నాని పట్ల తలెత్తిన నెగెటివిటి వల్ల 'దేవదాస్' పై కొంత ఎఫెక్ట్ పడిందనే టాక్ ఉంది.  మరి ఈ సారి 'మన్మథుడు 2' టీమ్ ఈ చిన్మయి హేటర్ల హీట్ ఎలా తప్పించుకుంటుందో వేచి చూడాలి.  ఇవన్నీ ఏమో కానీ అత్తమీద కోపం దుత్త మీద చూపిస్తున్నట్టుగా నెటిజన్లు చిన్మయి మీద ఉన్న కోపాన్ని 'మన్మథుడు 2' పై చూపించడం ఏంటో!


Tags:    

Similar News