• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: ఘట్టిగా సెటైరేసిన...

వీడియో: ఘట్టిగా సెటైరేసిన సుశాంత్!

By - Tupaki Desk
Update: 2018-07-23 06:26 GMT
బైబిల్ లో ఒక సూక్తి ఉంది.. 'తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును'.  మరి ఈ కాలంలో హబుల్ టెలిస్కోప్ పెట్టి చూసినా తమను తాము తగ్గించుకునేవాళ్ళెవరూ కనిపించరు కదా! కానీ అది ఫాలో అయ్యేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు.  పెద్దవాళ్ళు పదే పదే మొత్తుకునే 'వినయం.. వినమ్రత'.. ఇలాంటి కాన్సెప్టే! చిత్రంగా సుశాంత్ ఈమధ్యనే ఒక  'గట్టిగా కొడతా' అంటూ రాయలసీమ ఫ్యాక్షనిస్టు తరహాలో టైటిల్ పెట్టి ఒక ప్రమోషనల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

గట్టిగా కొడతా అంటే లాగిపెట్టి రెండు చెంపలూ వాయస్తాడని మనం అనుకుంటాం గానీ.. అలా కాకుండా సెన్సిబుల్ గా ఈ జెనరేషన్ ప్రేక్షకులు ఇష్టపడేలా ఈ కాన్సెప్ట్ వీడియో ఉంది.  ఇందులో తన మీద ఉన్న రూమర్లన్నిటిపైన సెటైర్లు వేసుకోవడం..కొన్నిటికి ఇండైరెక్ట్ గా సమాధానం ఇవ్వడం మరో హైలైట్.  సుశాంత్ 'గట్టిగా కొడతా' అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు అనే వార్తలు ఈమధ్య మీడియా లో గుప్పుమన్నాయి. దీంతో అందరూ ఈ వీడియో ఆ 'గట్టిగా కొట్టే' సినిమా బాపతు వీడియో అనుకున్నారు గానీ.. ఇది 'చి ల సౌ' సినిమా ప్రమోషన్ వీడియో.

అక్కడినుండి స్టార్ట్ అయింది సెటైర్.  ఇందులో ఒక దర్శకుడు సుశాంత్ కు కథ చెప్పడానికి వస్తాడు. సుశాంత్ పేరు కు ముందు ఒక బాబు.. చివర ఒక బాబు తగిలించబోతే..  నైస్ గా కట్ చేసి 'బాబొద్దు లేండి.. ప్లీజ్ కాల్ మీ సుశాంత్' అంటాడు.  స్టొరీ స్టార్ట్ అయిన దగ్గరనుండి పంచ్ లే పంచులు.  ఇంతకీ మీకు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఉన్నాడా అని సుశాంత్ అతన్ని అడుగుతాడు..  'అంటే మీరు ప్రొడ్యూసర్ కాదా?' అంటూ అతను రిప్లై ఇస్తాడు... మీ నాలుగు సినిమాలకు మీరే ప్రొడ్యూసర్ కదా? అంటూ అందరిలానే ప్రశ్నిస్తాడు.  తర్వాత ఫ్యామిలీలో ఉండే అన్నీ రిఫరెన్స్ లు విచ్చలవిడిగా వాడేద్దామని చెప్తాడు.  అంతలో రాహుల్ రవీంద్రన్ నుండి కాల్ రావడంతో అలా బయటకు వెళ్లి మాట్లాడతాడు. ఫైనల్ గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'చి ల సౌ' అనే సింపుల్ అండ్ రిలేటబుల్ సినిమా చేస్తున్నానంటూ చెప్తాడు. అప్పుడు అతని రియాక్షన్ వీడియో మొత్తం మీద హైలైట్ .. 'చి ల సౌ' కొరియన్ సినిమానా?'   ఇక మీరు ఆలస్యం చేయకుండా వీడియో చూడండి.. లేకపోతే సుశాంత్ మనమీద కూడా ఒక పంచ్ వేసేలా ఉన్నాడు!

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    
  • Sushant 
  • Ruhani Sharma 
  • ChiLaSow Movie 
  • Telugu news 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS