• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుల్తాన్ సినిమాకు తలపోటు...

సుల్తాన్ సినిమాకు తలపోటు మొదలైంది

By - Tupaki Desk
Update: 2016-07-10 09:48 GMT
ఈ మధ్య కొంచెం క్రేజున్న సినిమాలు విడుదలవుతుంటే చాలు.. ఈ కథ నాది అంటూ వివాదాలు తలెత్తడం మామూలైపోతోంది. కోలీవుడ్లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలకు కూడా పాకేసింది. లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సుల్తాన్’ టీంకు కూడా ఈ తలనొప్పి తప్పట్లేదు. ఐతే ఇక్కడ వివాదంలో ఓ ట్విస్టుంది. ‘సుల్తాన్’ టీం మీద ఆరోపణలు గుప్పిస్తున్న వ్యక్తి.. తాను రాసిన కథను కాపీ కొట్టినట్లు ఆరోపించట్లేదు. తన కథనే సినిమా తీసి.. తనకిస్తానన్న డబ్బులు ఇవ్వట్లేదని అంటున్నాడు. ‘సుల్తాన్’ టీం మీద కేసు పెట్టిన వ్యక్తి పేరు సబీర్ అన్సారీ. అతను బీహార్లోని ముజఫర్‌ పూర్ ప్రాంతానికి చెందిన వాడు.

సినిమాలో కనిపించే సుల్తాన్ పాత్ర తనదేనని.. తన జీవితంలో జరిగిన పరిణామాల ఆధారంగానే ఈ కథ రాశారని.. ఈ విషయంలో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తనతో సంప్రదింపులు జరిపాడని.. తన కథతో సినిమా తీసినందుకు రూ.20 కోట్లు ఇచ్చేట్లు ఒప్పందం కుదిరిందని.. ఇందుకు సల్మాన్ కూడా ఒప్పుకున్నాడని.. చివరికి తనను మోసం చేశారని సబీర్ ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని సీజేఎం కోర్టును ఆశ్రయించాడు. చిత్ర కథనాయకుడు సల్మాన్ ఖాన్.. కథానాయిక అనుష్క శర్మ.. నిర్మాత ఆదిత్య చోప్రా.. దర్శకుడు అలీ అబ్బాస్‌ లపై అతను చీటింగ్ కేసు పెట్టాడు. సినిమా విడుదలకు ముందే డబ్బులిచ్చేట్లు ఒప్పందం కుదిరిందని.. కనీసం విడుదల తర్వాత అయినా తనకు న్యాయం జరుగుతుందనుకుంటే ఎవ్వరూ స్పందించట్లేదని అతనన్నాడు. ఈ కథ విషయంలో.. పాత్ర విషయంలో సలహాల కోసం తనను సల్మాన్ చాలాసార్లు కలిశాడని అతను ఆరోపించాడు. మరి ఈ ఆరోపణలపై సల్మాన్ అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    
  • Cheating case 
  • Salman Khan 
  • Sultan Director 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS