• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బుల్లితెర నటిపై సంచలన...

బుల్లితెర నటిపై సంచలన ఆరోపణలు చేసిన భర్త..!

By - Tupaki Desk
Update: 2022-11-04 23:30 GMT
బుల్లితెర నటిగా.. వ్లాగర్ గా చారు అపోహకు బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. చక్కటి నటనతోపాటు గ్లామర్ పరంగా ఆకట్టుకునే ఈ భామ హిందీలో ప్రసారమవుతున్న పలు టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తుంది. బల్వీర్‌లో అత్ఖాతి పరిగా.. మేరే అంగ్నే మేలో ప్రీతిగా.. జిజి మాలో పియాలీ వంటి పాత్రలతో చారు అపోహ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది.

2019లో సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ ను ఆమె రెండో వివాహం చేసుకుంది. నటిగా చారు అపోహ స్టార్డమ్ సొంతం చేసుకున్నప్పటికీ వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆమె తన భర్త రాజీవ్ సేన్ పై సంచలన ఆరోపణలు చేస్తుంది. రాజీవ్ తనను నిత్యం అనుమానిస్తూ నరకం చూపించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లయిన నాటి నుంచి ఇబ్బందులకు గురి చేసేవాడని తెలిపింది.

తమ మధ్య గొడవ అయిన ప్రతీసారి తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయే వాడని వాపోయింది. రాజీవ్ తనను పెట్టిన టార్చర్ గురించి ఆమె సోదరి సుస్మితా కూడా తెలుసంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విబేధాల కారణంగా తాము కొన్ని రోజులు విడిపోయామని.. అయితే పెద్దలు నచ్చజెప్పడంతో మళ్లీ కలిసి ఉన్నామని చెప్పింది. అయినప్పటికీ తనలో మార్పు రాలేదని వాపోయింది.

రాజీవ్ చేసే చేసే టార్చర్ వల్ల ఎన్నో ఆఫర్లు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించింది. ఇకపై అతనితో కలిసి ఉండబోనని విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చారు అపోహ మీడియా ముఖంగా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆమె భర్త రాజీవ్ సేన్ సైతం మీడియా ముందుకొచ్చి తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు.

తన భార్య అపోసన చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్దాలని రాజీవ్ తెలిపారు. విమెన్ కార్డును అడ్డం పెట్టుకొని ఆమె నాటకాలు ఆడుతుందని మండిపడ్డాడు. తాను చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవని.. ఈ విషయంలో తనను ఎప్పటికీ క్షమింబోనని రాజీవ్ సేన్ వ్యాఖ్యానించాడు. నిజానికి అపోసనే తన తోటి నటుడు కరుణ్ మెహ్రతో రొమాంటిక్ రిల్ చేసిందన్నాడు. అలాంటి ఆమె తిరిగి తనపైనే చీటింగ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నాడు.

కరణ్.. అసోహ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనేలా రాజీవ్ సేన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. తొలుత ఆమె తనపై అపోహ మీడియా ముందుకొచ్చి మాట్లాడినందునే తాను కూడా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. ఇకపై తనతో జీవితాన్ని కలిసి పంచుకునే లేదని తేల్చిచెప్పాడు. రాజీవ్ వ్యాఖ్యలపై అపోస ఎలా రియాక్ట్ అవుతుందో మరీ..!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • CharuAposa 
  • Bollywood 
  • TvActress 
  • Atkhati 
  • Balveer 
  • SushmitaSen 
  • RajivSen 
  • MovieNews 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS