ఛార్మీ.. ఏంటా కత్తి పోజులు?

Update: 2016-05-17 11:30 GMT
పైన ఉన్న ఫొటోను సడెన్ గా చూస్తే ఛార్మి ఏదైనా మటన్ కొట్టులోకి దూరి మాంసం నరికే పనిలో పడిందేమో అన్న సందేహం రాకమానసదు. ఐతే అది డమ్మీ కత్తి అని.. తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేయడం కోసం తయారు చేయించిన స్పెషల్ కత్తి అని అర్థమవుతుంది.

అవును.. ఈ రోజు ఛార్మి పుట్టిన రోజు. గతంలో సినిమా అవకాశాలు మెండుగా ఉన్న టైంలో సైతం తన ప్రతి పుట్టిన రోజుకు ఇంటికి వెళ్లిపోవడమో లేదంటే.. తన ఫ్యామిలీ మెంబర్స్ నే ఇక్కడికి రప్పించుకోవడమో చేసేది ఛార్మి. ఇప్పుడు కూడా అలాగే తన తల్లిదండ్రులు.. అన్నా వదినలతో కలిసి పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా జరుపుకుంది ఛార్మి.

ఇంతకుముందు సినిమాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల తన కుటుంబ సభ్యులతో పెద్దగా టైం స్పెండ్ చేయలేకపోయేదీ బొద్దు భామ. కానీ ఈ మధ్య వాళ్లకే ఫుల్ టైం కేటాయిస్తోంది. గత ఏడాది ‘జ్యోతిలక్ష్మీ’లో నటించాక ఛార్మి ఫుల్ ఖాళీయే. ఈ గ్యాప్ లో తన వాళ్లతో కలిసి షాపింగులు చేసుకుంటూ.. పార్టీలు..పండగలు జరుపుకుంటూ గతంలో మిస్సయిన క్వాలిటీ టైంను ఇప్పుడు ఆస్వాదిస్తోంది ఛార్మి. 29 ఏళ్లు పూర్తి చేసుకుని 30వ పడిలో పడుతున్న పంజాబీ ముద్దుగుమ్మ ఇక పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చేసిందేమో!
Tags:    

Similar News