పూరి కొత్త విల‌న్‌ ని ప‌ట్టాడు!

Update: 2015-07-27 15:09 GMT
టాలీవుడ్ లో  ఎవ్వ‌రికీ పెద్ద‌గా ప‌రిచ‌యం లేని పేరు... చ‌ర‌ణ్‌ దీప్‌. విల‌న్‌గా అడ‌పాద‌డ‌పా తెలుగు సినిమాల్లో న‌టించాడు. త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ న‌టించిన `జిల్లా`లో అద‌ర‌గొట్టాడు. ఆమ‌ధ్య క‌ళ్యాణ్‌రామ్ `ప‌టాస్‌`లోనూ విల‌న్‌ గా క‌నిపించి మెప్పించాడు చ‌ర‌ణ్‌ దీప్‌. ఇప్పుడు ఆయ‌న‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ క‌న్నుప‌డింది. త‌న కొత్త చిత్రం `లోఫ‌ర్‌`లో  చ‌ర‌ణ్‌ దీప్‌ ని విలన్ గా ఎంచుకున్నాడు పూరి.  వరుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. వ‌రుణ్ ఆరున్న‌ర అడుగుల హైటుంటాడు. విల‌న్ కూడా అందుకు త‌గ్గ‌ట్టుగా ఉండాలి  క‌దా మ‌రి! అస‌లే పూరి సినిమాల్లో విల‌న్లు చాలా ప‌వ‌ర్‌ ఫుల్‌ గా క‌నిపిస్తుంటారు. అందుకే ఏరికోరి కండ‌లు తిరిగిన చ‌ర‌ణ్‌ దీప్‌ ని సెలెక్ట్ చేశాడు. మ‌రి వ‌రుణ్ ఈయ‌న్ని ఎలా ఢీకొడ‌తాడో చూడాలి.

అన్న‌ట్టు కొత్త‌వాళ్ల‌ను తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డంలో ముందుంటాడు పూరి జ‌గ‌న్నాథ్‌. చాలా మందికి త‌న సినిమాల‌తో లైఫ్ ఇచ్చాడు. ఒక్క‌సారి ఆయ‌న‌కి న‌చ్చారంటే వాళ్ల‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ చేయ‌డం పూరి అల‌వాటు. అందుకే చ‌ర‌ణ్‌ దీప్‌ ని ఇక‌పై పూరి సినిమాల్లో చూడొచ్చ‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. నిన్న‌మొన్న‌నే `లోఫ‌ర్‌`ని ప‌ట్టాలెక్కించాడు పూరి. అప్పుడే య‌మా జోరుమీద చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నాడు. ఆగ‌స్టులోపు షూటింగ్ పూర్తి చేస్తార‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ జ‌నాలు చెప్పుకొంటున్నారు. `టెంప‌ర్‌`కి ముందు ఎన్టీఆర్ కోసం రాసుకొన్న క‌థ అట ఇది. ఇదే క‌థ‌ని నితిన్‌ తో తీయాల‌నుకొన్నాడు. చివరికి వరుణ్ తో సెట్టయ్యింది.
Tags:    

Similar News