• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'జెర్సీ' డైరెక్టర్ మూవీలో...

'జెర్సీ' డైరెక్టర్ మూవీలో చరణ్ డ్రీమ్ రోల్!

By - Tupaki Desk
Update: 2021-11-15 07:49 GMT
చరణ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. కథ కొత్తగా అనిపిస్తే ఇటు యంగ్ డైరెక్టర్లతో పాటు, అటు సీనియర్ స్టార్ డైరెక్టర్ల సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' చేసిన ఆయన, కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా ఒక నెల గ్యాపులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాల జోనర్లు వేరైనా చరణ్ పాత్ర మాత్రం ఉద్యమకారుడిగా .. పోరాట యోధుడిగా కొనసాగనుండటం విశేషం.

ఈ రెండు సినిమాలు విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చరణ్ ఓకే చెప్పాడు. చాలా తక్కువ గ్యాపులోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణను ఈ షెడ్యూల్లో పూర్తి చేశారు. ఈ రోజున సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో నడిచే కొన్ని సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారు.

ఇక గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ .. 'స్పోర్ట్స్ డ్రామా'లో చేయాలని ఉందని అన్నాడు. స్పోర్ట్స్ మెన్ గా కనిపించడమనేది తన డ్రీమ్ అనీ .. అలాంటి పాత్రకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. ఇక త్వరలోనే ఆయన డ్రీమ్ నెరవేరనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన ఒక స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు .. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి. ఎవరా డైరక్టర్ .. ఏమా కథ అంటే 'గౌతమ్ తిన్ననూరి' పేరు చెప్పవలసి ఉంటుంది. తొలి సినిమా అయిన 'జెర్సీ'తోనే ఆయన అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. నానీకి భారీ హిట్ ను .. నిర్మాతలకు భారీ వసూళ్లను ముట్టజెప్పాడు.

ఆ తరువాత  ఆయన ఇదే సినిమాను హిందీలోను రీమేక్ చేశాడు. మళ్లీ ఇప్పుడు చరణ్ తో సినిమా చేయడానికి రంగంలోకి దిగుతున్నాడు. ఇది కూడా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కథనే. ఈ ప్రాజెక్టు పట్ల చరణ్ చాలా ఆసక్తిగా ఉన్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ మరో తమిళ దర్శకుడిని లైన్లో పెట్టినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది .. ఆ దర్శకుడి పేరే ధరణి. తమిళంలో మమ్ముట్టి .. విక్రమ్ .. విజయ్ .. శింబులతో ఆయన సినిమాలు చేశాడు. తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా 'బంగారం' సినిమా చేసింది ఈయనే. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు చరణ్ సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.       
Tags:    
  • rc15 
  • ramcharan 
  • ramcharan movies 
  • ramcharan rc15 
  • shankar 
  • ramcharan rc15 shooting 
  • gowtam tinnanuri 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS