అతని వైఫల్యం.. మన వైఫల్యమే..

Update: 2016-08-09 05:30 GMT
చంద్రశేఖర్ ఎలాటి... కోటానుకోట్ల కలెక్షన్లు సాధించగలిగే సత్తా వున్న రాజమౌళి లాంటి దర్శకుడిని సైతం ఆశ్చర్యపరచగల దర్శకుడు. తన జీవితంలో ఇలాంటి సినిమా తీయలేనని జక్కన్న స్వయంగా ప్రశంసించిన దర్శక సంచలనం.

అయితే ఏలేటి తాజా చిత్రం మనమంతా సినిమాకు సెలబ్రిటీల నుండీ - క్రిటిక్స్ నుండీ ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నా - మౌత్ టాక్ ఎంత బాగున్నా ప్రేక్షకులను థియేటర్ ల దగ్గరకు తీసుకెళ్ళలేకపోతోంది. తొలిరోజు వినిపించిన టాక్ తో రెండో రోజు నుండి హౌస్ ఫుల్ కలెక్షన్లను భావించిన వారి ఆశ ఆశగానే మిగిలింది.

అనవసరమైన సన్నివేశాలు - అసభ్యమైన మాటలు లేకుండా ఆడియన్స్ ని నేటితరంలో రెండున్నర గంటల పాటూ ఎంగేజ్ చెయ్యడం మాటలుకాదు. అలాంటి ఛాలెంజ్ ని ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొని ఏలేటి ఎన్నో సార్లు విజయం సాధించాడు. ఇటువంటి దర్శకుల ప్రయత్నాలను సహకరించకపోతే భవిష్యత్ లో వీరి నుండి రాబోయే కొన్ని క్లాసిక్ పీస్ లను కూడా మిస్ అవ్వడం తథ్యం.
Tags:    

Similar News