క్రేజీ వెబ్ సిరీస్ లో మరో హీరోయిన్ కు చాన్స్
దర్శక ద్వయం రాజ్ మరియు డీకే లు వరుసగా బాలీవుడ్ లో సూపర్ క్రేజీ ప్రాజెక్ట్ లను చేస్తూ స్టార్స్ గా మారిపోయారు. ముఖ్యంగా వీరిద్దరు తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు సీజన్ లు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం వారు చేస్తున్న వెబ్ సిరీస్ పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. ఈసారి వీరు చేస్తున్న వెబ్ సిరీస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతోంది. బాలీవుడ్ నుండి షాహిద్ కపూర్ నటిస్తుండగా కీలక పాత్రలో అమోల్ పాలేకర్ నటిస్తున్నాడు.
ఇక సౌత్ లో స్టార్ అయిన విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ ముగ్గురు కూడా ఎవరికి వారే ది బెస్ట్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అమోల్ పాలేకర్ జాతీయ అవార్డు గ్రహీత. ఆయన ఈ వెబ్ సిరీస్ లో నటించడం వల్ల మరింత క్రేజీగా మారిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో రాశిఖన్నా నటిస్తున్న విషయం ఎప్పుడో తేలిపోయింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ లో రెజీనా కూడా నటిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది.
సౌత్ ఆడియన్స్ కు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న రెజీనా ఈ వెబ్ సిరీస్ లో నటించడం వల్ల ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఈవెబ్ సిరీస్ లో ఇప్పటికే రాశిఖన్నా ఉన్నప్పటికి ఈమెకు దక్కే ప్రాముఖ్యత ఈమెకే దక్కుతుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఆమద్య రాశిఖన్నా ఇంకా ఇతర నటీ నటులు ఆన్ లొకేషన్ ఫొటోలు మరియు వీడియోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ను చాలా ప్రత్యేకంగా ప్రేక్షకులు చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఖచ్చితంగా ఎలాంటి డౌట్ లేకుండా వెబ్ సిరీస్ సక్సెస్ అవుతుందనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.
రెజీనా ఇప్పటికే నటిగా మంచి పాత్రలు చేసి నిరూపించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆమె నటించిన సినిమాలు బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వలేదు కనుక స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు కాస్త తక్కువగా వచ్చాయి. అందుకే టాప్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయినా కూడా రెజీనాకు లక్ కలిసి రాకపోవడంతో ఆమెకు ఆ స్థాయి దక్కలేదు. ఎట్టకేలకు ఒక మంచి వెబ్ సిరీస్ లో ఈమెకు మంచి పాత్ర దక్కడం వల్ల ఖచ్చితంగా ఇకపై అయినా రెజీనా ను స్టార్ హీరోలు పట్టించుకుంటారు అనే నమ్మకంను మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ నుండి కూడా రెజీనాకు ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆఫర్లు వచ్చే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి క్రేజీ వెబ్ సిరీస్ లో మరో హీరోయిన్ గా రెజీనాకు ఛాన్స్ దక్కిన నేపథ్యంలో ఆ వెబ్ సిరీస్ పై మరింత ఆసక్తి కనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కోసం అన్ని భాషల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.