థియేట‌ర్ల‌పై ఏపీ సీఎం నిర్ణ‌యానికి ఛాంబ‌ర్ హ‌ర్షం

Update: 2021-04-07 10:30 GMT
క‌రోనా మ‌హ‌మ్మారీ క‌ష్ట కాలంలో సినీప‌రిశ్ర‌మ‌ను ఆదుకునేందుకు ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భ‌రోసా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయన అన్న మాట నిల‌బెట్టుకుంటున్నారు. ముఖ్యంగా థియేట‌ర్ల రంగంలో ప‌రిస్థితికి చలించిన ఏపీ ప్ర‌భుత్వం త‌గు నిర్ణ‌యాల‌తో ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఏప్రిల్ - మే- జూన్ సీజ‌న్ కి థియేట‌ర్ల‌కు క‌రెంట్ ఛార్జీలు చెల్లంచ‌న‌వ‌స‌రం లేదు. మ‌రో ఆరు నెల‌లు ఫిక్స్ డ్ క‌రెంట్ ఛార్జీల చెల్లింపు వాయిదాల్లో చేసుకోవ‌చ్చు. అలాగే ఏ-బీ సెంట‌ర్ల 10ల‌క్ష‌ల అప్పులు.. సీ సెంట‌ర్ల‌లో 5ల‌క్ష‌ల అప్పుల‌పై మార‌టోరియంలో వ‌డ్డీల‌పై 50శాతం చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. ఆ మేర‌కు వ‌డ్డీ మాఫీని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.ర‌క‌ర‌కాల‌ వెసులుబాట్లు క‌ల్పిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై తెలుగు ఫిలింఛాంబ‌ర్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ ఛాంబ‌ర్ ఒక నోట్ ని వెలువ‌రించింది.

వేలాదిమంది సినీకార్మికుల‌కు ఉపాధినిచ్చేలా ఈ నిర్ణ‌యం తీసుకున్నందుకు సీఎంకి ఛాంబ‌ర్ పెద్ద‌లు స‌హా ప‌లువురు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ నిర్ణ‌యం తీసుకునేలా కృషి చేసిన సినీపెద్ద‌లు మెగాస్టార్ చిరంజీవి .. నాగార్జున‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మంత్రి పేర్ని నాని.. ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మ‌న్ విజ‌య చంద‌ర్ రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఏపీలో వెసులుబాటు క‌ల్పించారు.. తెలంగాణ‌లోనూ కేసీఆర్ అలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా.. సినీప‌రిశ్ర‌మ‌ను ఆదుకునేందుకు ఇక్క‌డ ఏం చేయ‌బోతున్నారు? అన్న‌ది వేచి చూడాలి.
Tags:    

Similar News