• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చ‌ల్ మోహ‌న్ రంగ‌ తమన్...

చ‌ల్ మోహ‌న్ రంగ‌ తమన్ ఖాతాలో మ‌రో హిట్!

By - Tupaki Desk
Update: 2018-03-18 08:11 GMT
లై త‌ర్వాత రాబోతోన్న `చల్ మోహ‌న్ రంగ‌` పై నితిన్ భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ - సుధాక‌ర్ రెడ్డి లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆ సినిమాపై ప్రేక్ష‌కులకు భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తొలిప్రేమ కు హిట్ మ్యూజిక్ అందించి మంచి ఫామ్ లో ఉన్న థ‌మ‌న్ కంపోజ్ చేసిన‌ `పెద్ద పులి` సాంగ్ కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంత‌ర్జాతీయ పాప్ సింగ‌ర్ ఆకోన్ కు `పెద్ద‌పులి` పాట తెగ న‌చ్చేసింది. ఆ పాట‌కు థ‌మ‌న్ మంచి బీట్ ఇచ్చాడ‌ని, లిరిక్స్ అర్థం కాక‌పోయినా.....బీట్ కు త‌గ్గ డ్యాన్స్ ఆక‌ట్టుకుంద‌ని ఆకోన్ తెలిపాడు. తాజాగా, ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని  ఈ చిత్రంలోని పాట‌ల‌ను నిన్న సాయంత్రం విడుద‌ల చేశారు.

తొలిప్రేమ త‌ర‌హాలోనే థ‌మ‌న్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఓ ప‌క్క మాస్ ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టునొని...మ‌రోప‌క్క క్లాస్ సాంగ్స్ ను మిక్స్ చేయ‌డంలో థ‌మ‌న్ స‌క్సెస్ అయ్యాడు. దానికితోడు యూత్ ను ఆక‌ట్టుకునేలా మెలోడీ సాంగ్ ను కంపోజ్ చేశాడు. మొత్తం ఆరు పాట‌లు మాస్ , క్లాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇప్ప‌టికే యూట్యూబ్ లో దుమ్ముదులిపేస్తోన్న `పెద్ద‌పులి` పాట త‌ర‌హాలోనే మిగ‌తా పాట‌లు కూడా క్యాచీ ట్యూన్స్ తో ఆక‌ట్టుకుంటున్నాయి. నితిన్ - మేఘా ఆకాశ్ లు జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

పాటలు వినటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    
  • Nithin 
  • Chal Mohan Ranga Movie 
  • Telugu NEws 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS