రిస్క్ వద్దంటూ.. చైతూ బాలీవుడ్ ఫిల్మ్ వాయిదా పడిందా..?

Update: 2021-06-08 14:30 GMT
ఇటీవలి కాలంలో హీరోలు ఏ దర్శకుడితో సినిమాలు చేసినా రిస్కే అయిపోతుందట. ఎందుకంటే కొత్తవాళ్లతో చేస్తే తొలిప్రయత్నం ఫలించక ఫెయిల్ అవుతున్నారు. మరి సీనియర్ దర్శకులతో చేస్తే సినిమా కథనాలు రొటీన్ అయిపోయి అవికూడా ప్లాప్స్ అవుతున్నాయి. కానీ ఈరోజుల్లో పరిస్థితి ఒకప్పటిలా లేదనేది అందరికి తెలిసిందే. హీరోలు ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలో తెలియక సంధిగ్ధంలో పడుతున్నారు. కానీ అక్కినేని హీరో మాత్రం డైరెక్టర్స్ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడట. నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్ ఆరంభం నుండి 'లవర్ బాయ్'గా ఫేమ్ తెచ్చుకున్నాడు.

చైతూ.. చివరిగా మజిలీ సినిమాతో ట్రెండ్ మార్చాడు. ఆ సినిమాలో తండ్రిగా కూడా నటించాడు. అయితే ప్రస్తుతం చైతూ డిఫరెంట్ స్టోరీలతో, నటనకు ఆస్కారం ఉన్నటువంటి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు.  మజిలీ తర్వాత రెండేళ్లు దగ్గరపడినా నాగచైతన్య నుండి ఒక్కసినిమా రాలేదు. భారీ విరామం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే లవ్ స్టోరీ మూవీ సోషల్ మీడియాతో ఇండస్ట్రీ వర్గాలలో సూపర్ బజ్ క్రియేట్ చేసింది. అలాగే చైతూ మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేసాడు.

ఇటీవలే థాంక్యూ మూవీ ఇటలీలో మెయిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే థాంక్యూ మూవీ షూటింగ్ పూర్తికాగానే వెంటనే నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటిస్తుండగా.. నాగచైతన్య కీలకపాత్రలో కనిపించనున్నాడు. అయితే 'లాల్ సింగ్ చద్దా' మూవీలో నాగచైతన్య ఓ కొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. అలాగే చైతూ పార్ట్ మొత్తం లడఖ్ లో షూట్ చేయబడతాయని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. లాల్ సింగ్ చద్దా జులై షెడ్యూల్ కాన్సల్ చేసాడట అమీర్ ఖాన్. కరోనా టైంలో రిస్క్ వద్దని మరో షెడ్యూల్ అనౌన్స్ చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఫారెస్ట్ గంప్' ఆధారంగా లాల్ సింగ్ చద్దా తెరకేక్కుతోంది.
Tags:    

Similar News