ల‌హ‌రి ఫిల్మ్స్‌ తో క‌లిసి ఫీచ‌ర్ ఫిల్మ్స్ నిర్మించ‌నున్న 'ఛాయ్ బిస్కెట్ ఫిలింస్'

Update: 2020-12-22 08:30 GMT
తెలుగు డిజిటల్ కంటెంట్ హౌస్‌ లలో ఒకటైన ఛాయ్ బిస్కెట్ ఇప్పుడు 'ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్' ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ప్రముఖ ఆడియో కంపెనీ లహరి మ్యూజిక్ యొక్క 'లహరి ఫిల్మ్స్' తో క‌లిసి సినిమాలను రూపొందించ‌నున్నట్లు పేర్కొన్నారు. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి మ్యూజిక్ యొక్క అసోసియేషన్ ఇప్పటికే కొంతమందితో సినిమాలు రూపొందించ‌డానికి ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. వాటి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఈ మేర‌కు వారి నుంచి రాబోతున్న మొదటి చిత్రం ఫస్ట్ లుక్ 2021 జనవరి 1న విడుదల‌ చేయ‌నున్న‌ట్లు వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా 'ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్' కో ఫౌండ‌ర్ అనురాగ్ మాట్లాడుతూ ''ఔత్సాహిక మరియు ప్రతిభావంతులైన రచయితలు, న‌టీన‌టులు, దర్శకులు మరియు ఇతర క‌ళాకారుల‌కు ఒక వేదికను అందించడమే 'ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్' యొక్క ముఖ్య ఉద్దేశ్యం'' అని తెలిపారు.

అలానే మరో కో ఫౌండ‌ర్ శ‌ర‌త్ చంద్ర మాట్లాడుతూ.. ''ఫీచర్ ఫిల్మ్ లో నాణ్య‌మైన కంటెంట్ ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము. లహరి ఫిల్మ్స్ తో భాగస్వామ్యం మాకు మ‌రిన్ని అవ‌కాశాల‌ను క‌ల్పించింది. ఇక నుండి ప్రతి సంవత్సరం కొన్ని చిత్రాలను రూపొందించడానికి మేము ఎదురు చూస్తున్నాము'' అని అన్నారు. ఇంకా 'లహరి ఫిల్మ్స్' పార్టనర్ చంద్రు మ‌నోహ‌ర్ మాట్లాడుతూ - ''సంగీత పరిశ్ర‌మ‌లో 45 సంవత్సరాల అనుభ‌వం ఉన్న మేము కొంతకాలంగా నిర్మాణ రంగంపై ఆసక్తి కలిగి ఉన్నాయి. ఇప్పటికే కన్నడలో సినిమాలు నిర్మించాం. మా సంస్థ‌లో యంగ్ టాలెంట్ కు అవ‌కాశం ఇచ్చి మంచి సినిమాలు నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News