కళాతపస్వికి కళాకారుల అభినందనలు

Update: 2017-04-25 04:24 GMT
కళాతపస్వి కె.విశ్వనాథ్ కు 2016 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించడంతో.. టాలీవుడ్ సంబరాల్లో మునిగిపోయింది. తెలుగు సినీ పరిశ్రమకు సంగీతాన్ని మృదు మధురంగా అద్దిన ఆయకు అవార్డులేమీ కొత్త కాదు. 1992లో పద్మశ్రీ అందుకున్న ఆయన.. 5 నేషనల్ అవార్డులు.. 20 నంది అవార్డుల.. 10 ఫిలింఫేర్.. ఒక లైఫ్ టైం ఎఛీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు.

కళాతపస్వికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంతో.. చిరంజీవి.. కమల్ హాసన్ సహా పలువురు ప్రముఖులు.. కళాకారాలు ఆయన్ను అభినందల్లో ముంచెత్తారు.

'కె. విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ వ్యక్తి ఆయన' అన్నారు చిరంజీవి.. రామ్ చరణ్.

'కళాతపస్వి కె. విశ్వనాథ్ కు అరుదైన గౌరవం. తెలుగు సినిమా గర్వించగ్గ క్షణం' అని ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్.

'మేథావి అయిన ఫిలిం మేకర్ కి ఇది సరియైన అవార్డ్. తెలుగు సినిమాకు దక్కిన గౌరవం' అన్నాడు కళ్యాణ్ రామ్.

'నా కె. విశ్వనాథ్ గారు ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ విజేత. ఆయన మంచితనం కొద్దీ తాను అదృష్టవంతుడిని అంటారు. కానీ నిజం ఏంటంటే భారతీయులే అదృష్టవంతులు' అన్నారు కమల్ హాసన్.

మళ్లీ దర్శకత్వం వహిస్తారా అని అడిగిన ప్రశ్నకు.. ప్రస్తుతం తాను ఎలా ఉన్నానో అలాగే ఉండాలని భావిస్తున్నానని.. కె.  విశ్వనాథ్ గానే బతుకుతానని అన్నారు కళా తపస్వి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News