వృషకర్మ.. నాగచైతన్య మార్కెట్ ఏ లెవెల్లో పెరిగిందంటే..

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ రిలీజ్ రూ.45 కోట్లకు తీసుకుంది.

Update: 2026-10-27 05:00 GMT

నాగచైతన్య కెరీర్‌కు 'తండేల్' ఎంత పెద్ద బూస్ట్ ఇచ్చిందో ఇప్పుడు ఆయన కొత్త సినిమా బిజినెస్ చూస్తే అర్థమవుతోంది. గతంలో చైతూ సినిమాల థియేట్రికల్ రైట్స్ ఒక రేంజ్‌లో ఉంటే ఇప్పుడు అంతకుమించి అనేలా ఉన్నాయి. 'వృషకర్మ' కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీ డీల్స్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ముఖ్యంగా దిల్ రాజు ఈ సినిమా కోసం చేస్తున్న డీల్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తున్న సినిమాగా 'వృషకర్మ' నిలుస్తోంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ రిలీజ్ రూ.45 కోట్లకు తీసుకుంది. ఇందులో రూ.40 కోట్లు నాన్‌రిఫండబుల్ కాగా, మిగిలిన రూ.5 కోట్లు రిఫండబుల్ ఒప్పందంలో భాగంగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి 'తండేల్'కు ముందు నాగచైతన్య మార్కెట్ పరిస్థితి వేరు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' వంద కోట్లకు పైగా వసూళ్లతో చైతూ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

ఆ విజయం తర్వాత ఆయన ఎంచుకున్న 'వృషకర్మ' బడ్జెట్, మేకింగ్, బిజినెస్ అన్నింటిలోనూ మరో మెట్టు పైకి వెళ్లింది. పైగా థియేట్రికల్ బిజినెస్ ఒక్కటే కాదు. 'వృషకర్మ' డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య కెరీర్‌లో నాన్ థియేట్రికల్ పరంగా కూడా ఇదే అతిపెద్ద డీల్‌గా చెబుతున్నారు.

ఇప్పుడు మొత్తంగా విడుదలకు ముందే ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా బిజినెస్ చేసే హీరోగా నాగచైతన్య రేంజ్ మారుతోంది. 'విరూపాక్ష'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకుడు కావడం మరో పెద్ద ప్లస్. మైథలాజికల్ అంశాలతో కూడిన అడ్వెంచర్ థ్రిల్లర్‌గా 'వృషకర్మ'ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య లుక్, ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ సెట్స్, వీఎఫ్ఎక్స్‌తో కొత్త ప్రపంచాన్ని చూపించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 4న 'వృషకర్మ' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి థియేట్రికల్ నెట్‌వర్క్ ఉన్న దిల్ రాజు ఇప్పుడు కర్ణాటక హక్కులను కూడా తీసుకోవడంతో రిలీజ్ ప్లానింగ్‌కు అదనపు బలం దొరికింది.

ముఖ్యంగా 'తండేల్' తర్వాత నాగచైతన్య సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి ఉంది. ఇప్పటివరకు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ సినిమాలతో ఎక్కువ విజయాలు అందుకున్న చైతూ ఈసారి భారీ మైథలాజికల్ అడ్వెంచర్‌తో వస్తున్నారు. ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇప్పటికే కెరీర్ లో టాప్ రికార్డులు అందుకున్న చైతన్యకు బాక్సాఫీస్ దగ్గర కూడా మరో బిగ్ ఓపెనింగ్స్ దక్కుతాయని అర్థమవుతుంది.

Tags:    

Similar News