మృణాల్ దీపావ‌ళి మెరుపులు విరుపులు

మృణాల్ అంద‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ కి త‌గ్గ డిజైన‌ర్ లుక్ ఇది. అధునాత‌న శైలికి రాయ‌ల్ అల‌గెన్స్ జోడిస్తే ఎంత బావుంటుందో ఈ ఫోటోషూట్ చెప్ప‌క‌నే చెబుతోంది.

Update: 2026-10-27 05:52 GMT

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనదైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్, తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న `దివాళీ ఎడిషన్` ఫొటోషూట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఫొటోలలో మృణాల్ నలుపు రంగు శారీ ధరించి రాయల్ అండ్ క్లాసీ లుక్‌తో కనిపించారు. క్లాసిక్ శైలికి ఆధునిక స్పర్శను జోడిస్తూ ఆమె ఇచ్చిన స్టిల్స్ నెటిజన్లను ఎంతగానో అలరిస్తున్నాయి.

 

ఈ రాయల్ అండ్ ఎలిగెంట్ లుక్ వెనుక ఒక పెద్ద స్టైలింగ్ టీమ్ పనిచేసింది. `ఇత్రు` బ్రాండ్‌కు చెందిన నల్లటి డిజైనర్ శారీలో మృణాల్ మెరిసిపోగా.. ఈ లుక్‌ను అంజలి-స్నేహల్ అత్యంత ఆకర్షణీయంగా స్టైల్ చేశారు. దానికి తగినట్లుగా `బెస్పోక్ ఓజెల్స్` హ్యాండ్‌బ్యాగ్, `అపరాజిత తూర్` ఫుట్‌వేర్‌ను మ్యాచ్ చేశారు. మేకప్ ఆర్టిస్ట్ మిస్ బ్లెండర్, హెయిర్ స్టైలిస్ట్ దీపాలి దేవ‌కర్ , శారీ డిజైన‌ర్ శిల్పా ఈ బ్యూటీని దేవకన్యలా తీర్చిదిద్దగా, విధి గోధా తన కెమెరాతో ఈ అందమైన ఫోటోల‌ను బంధించారు.

 

సాధారణంగా పండుగల సమయాల్లో ఎరుపు, పసుపు వంటి సాంప్రదాయ రంగులను ఎంచుకుంటారు.. కానీ మృణాల్ మాత్రం నలుపు రంగు శారీని ఎంచుకుని సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. మృణాల్ అంద‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ కి త‌గ్గ డిజైన‌ర్ లుక్ ఇది. అధునాత‌న శైలికి రాయ‌ల్ అల‌గెన్స్ జోడిస్తే ఎంత బావుంటుందో ఈ ఫోటోషూట్ చెప్ప‌క‌నే చెబుతోంది.

 

ఈ ఫోటోల‌కు ఇంట‌ర్నెట్ లో స్పంద‌న అద్భుతం. శోభిత ధూళిపాళ, ప్రగ్యా వంటి తోటి నటీమణులు ఈ లుక్‌పై ప్రశంసలు కురిపించగా.. నెటిజన్లు ``బ్లాక్ శారీలో మృణాల్ దేవతలా ఉందంటూ`` కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సీతా రామం, హాయ్ నాన్న స‌హా ప‌లు చిత్రాల్లో అద్భుత న‌ట‌నాభిన‌యంతో క‌ట్టి ప‌డేసిన మృణాల్ మ‌రిన్ని తెలుగు చిత్రాల్లో న‌టించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో మెప్పించేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంది.

 

నటి మృణాల్ ఠాకూర్ 2026 సంవత్సరంలో వరుస సినిమాలతో థియేటర్లు- OTT ప్లాట్‌ఫారమ్‌లలో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్- పూజా హెగ్డేలతో కలిసి నటించిన రొమాంటిక్ కామిడీ చిత్రం `హై జవానీ తో ఇష్క్ హోనా హై` థియేటర్లలోకి వచ్చి అలరించింది. అలాగే అడివి శేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం `డెకాయిట్: ఏ లవ్ స్టోరీ` లోనూ, రొమాంటిక్ డ్రామా `దో దివానే షెహర్ మే` లోనూ కీలక పాత్రలు పోషించారు. వీటికి తోడు హుమా ఖురేషీతో కలిసి నటించిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ డ్రామా మూవీ `పూజా మేరీ జాన్` 2026 అక్టోబరులో జీ5లో నేరుగా విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కొన్ని నూతన తెలుగు, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ రాకాలోను మృణాల్ న‌టిస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

Tags:    

Similar News