Bigg Boss Telugu 10: వర్షిణి - త్రిగుణ్ మధ్య ఎమోషనల్ సీన్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారం ఆట ప్రారంభం నుండి హౌస్‌లో రగడ మొదలైంది. రూమ్ క్లీనింగ్, బట్టలు ఉతకడం, కెప్టెన్సీ రూమ్ విషయాల నుంచి చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్ద వాదనలకు దారి తీశాయి.

Update: 2026-10-27 03:46 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారం ఆట ప్రారంభం నుండి హౌస్‌లో రగడ మొదలైంది. రూమ్ క్లీనింగ్, బట్టలు ఉతకడం, కెప్టెన్సీ రూమ్ విషయాల నుంచి చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్ద వాదనలకు దారి తీశాయి. ముఖ్యంగా ముఖేష్ - దెబ్జానీ, ముఖేష్ - శివ మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి.

హౌస్‌లో ఎవరికి వారు ఎవరి మాట వినకుండా సొంత వాదనలు వినిపించడంతో ప్రతి విషయంలోనూ గొడవలు తలెత్తుతున్నాయి. అసలు ఈ సీజన్ మొత్తంగా గ్రూప్ పాలిటిక్స్ ఆధారంగానే నడుస్తోందనేది స్పష్టమవుతోంది. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో త్రిగుణ్ - వర్షిణిల మధ్య జరిగిన ఎమోషనల్ సీన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

గత వారం త్రిగుణ్ వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలకు గాను బిగ్‌బాస్ ఆయనకు 'జైలు శిక్ష' విధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గతానికి భిన్నంగా ఈసారి రూమ్‌లో వేయకుండా, చేతులకు బేడీలు వేసి హౌస్‌లోనే ఉంచారు. ఆ తర్వాత కొంత సమయానికి బిగ్‌బాస్ నిర్ణయం మేరకో లేక పరిస్థితుల బట్టో ఆ బేడీలను తొలగించారు.

గ్రీన్, రెడ్, ఎల్లో టీమ్‌ల కాన్సెప్ట్ ఆధారంగా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. మొదటగా నీతు మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే లేపాయి.

ఈ నామినేషన్లలోనే త్రిగుణ్.. గత వారం గేమ్‌లో వర్షిణి తనని అర్థం చేసుకోలేదు అనే విషయాన్ని పొరపాటును ఎత్తి చూపుతూ ఆమెను నామినేట్ చేశాడు. బయట మంచి స్నేహితులుగా ఉన్న తమ మధ్య బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అదే బాండింగ్ ఉంటుందని భావించిన వర్షిణికి ఇది పెద్ద షాక్‌లా తగిలింది.

త్రిగుణ్ నామినేట్ చేయగానే వర్షిణి తీవ్ర మనస్తాపానికి గురైంది. దీన్ని చాలా పర్సనల్‌గా తీసుకుని విలపించింది. వర్షిణి ఏడుపు చూసి హౌస్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. వర్షిణి వైపు చూడలేక త్రిగుణ్ తన తలను పక్కకు తిప్పుకోవడం కాకుండా, తనలో తనే బాధను దిగమింగుకోవడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక ఎవరి గేమ్‌ వారు ఆడుకోవాల్సిందేనని, వర్షిణి ఎంత తొందరగా ఈ విషయం అర్థం చేసుకుంటే అంత బాగా గేమ్ ఆడగలదు.

Tags:    

Similar News